Advertisementt

పోలీస్ స్టేషన్ చుట్టూ బిగ్ బాస్ సరయు

Tue 08th Feb 2022 10:55 AM
bigg boss,7 arts,sarayu,bigg boss sarayu,yutuber sarayu,sarayu arrested  పోలీస్ స్టేషన్ చుట్టూ బిగ్ బాస్ సరయు
Bigg Boss Sarayu Arrested పోలీస్ స్టేషన్ చుట్టూ బిగ్ బాస్ సరయు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 లోకి వచ్చి ఒక్క వారానికే ఎలిమినేట్ అయిన.. యూట్యూబ్ సరయు ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. యూట్యూబ్ లో 7 ఆర్ట్స్ పేరుతొ ఛానల్ పెట్టి అందులో భూతు పదాలతో, బోల్డ్ కేరెక్టర్ లో రెచ్చిపోతూ పాపులర్ అయిన సరయు కి ఇప్పుడు అదే యూట్యూబ్ వలన కష్టలు మొదలయ్యాయి. సరయు మీద ఆరెసెస్ వాళ్ళు కేసు పెట్టడంతో గత రాత్రి ఆమెని బంజారా హిల్స్ పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. ఓ హోటల్ కోసం చేసిన ప్రమోషనల్ సాంగ్ లో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సరయు వ్యవహరించారని VHP నేత సరయూపై ఫిర్యాదు చేశాడు. 

సరయు చేసిన ఈ యూట్యూబ్ వీడియో తీవ్ర అభ్యంతరకరంగా ఉందని.. అందులో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందంటూ సరయుపై కేసు నమోదైంది. హోటల్‌ ప్రమోషన్ సాంగ్‌లో సరయుతో పాటు మరికొందరు గణపతి బప్పా మోరియా బ్యాండ్‌ను తలకు పెట్టుకుని ఉన్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దేవుడి బొమ్మలు పెట్టుకుని.. మందు తాగుతూ హోటల్‌ను సందర్శిస్తారనే సంకేతాన్ని ఆ ప్రమోషనల్ సాంగ్‌లో చూపిస్తున్నారని ఆయన వెల్లడించాడు. దానితో పోలీస్ లు కేసు నమోదు చేసుకుని విచారించి సరయుని అరెస్ట్ చేసారు. అయితే రాత్రే ఆమెని వదిలేసిన పోలీస్ లు ఈ రోజు మరోసారి పోలీస్ స్టేషన్ కి రాల్సిందిగా సరయుకి చెప్పారని తెలుస్తుంది. మరి ఈ కాంట్రవర్సీ సరయు యూట్యూబ్ కన్నా ఎక్కువగా ఇలా పాపులర్ అయ్యింది. 

Bigg Boss Sarayu Arrested:

Police arrest Bigg Boss Telugu fame Sarayu 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ