Advertisementt

టాలీవుడ్ కీలక సమావేశం వాయిదా

Mon 07th Feb 2022 07:25 PM
tollywood,chiranjeevi,top producers,ap cm,jagan,tollywood meeting  టాలీవుడ్ కీలక సమావేశం వాయిదా
Tollywood meeting postponed once again టాలీవుడ్ కీలక సమావేశం వాయిదా
Advertisement
Ads by CJ

రేపు మంగళవారం టాలీవుడ్ లో కీలక సమావేశం జరగనుంది. టాలీవుడ్ నిర్మాతలు, మెగాస్టార్ చిరు ఇంకా టాలీవుడ్ ప్రముఖులు ఈ కీలక సమావేశంలో పాల్గొనబోతున్నారు. మెగాస్టార్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతున్న ఇప్పుడు చిరు కూడా ఇండస్ట్రీ లోని అందరిని కలుపుకుపోవాలని చూస్తున్నారు. అందుకే చిరు స్వయంగా ఇండస్ట్రీ పెద్దలకి ఫోన్ చేసి మరీ ఈ మీటింగ్ కి ఆహ్వానించినట్లుగా ఫిలింసర్కిల్స్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే రేపు జరగబోయే ఈ కీలక సమావేశంలో ఏం జరగబోతుంది, అందరూ కలిసి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే ఆత్రుత అందరిలో ఉంది.

ఇంకా ఈ సమావేశంలో ఏపీ సీఎం ని జగన్ ని కలిసే విషయం చర్చిస్తారని, ఆంధ్రాలో టికెట్ రేట్స్, అలాగే బెన్ఫిట్ షోస్ నిర్వహణ, ఇంకా 5 వ ఆటకి అనుమతులపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

అయితే రేపు జరగాల్సిన కీలక సమావేశం మరోసారి వాయిదా పడింది. రేపు జరగబోయే ఈ సమావేశానికి కొంతమంది సినీ పెద్దలు అందుబాటులో లేని కారణంగా ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. కొందరు షూటింగ్స్ తో ఇతర ప్రాంతాల్లో ఉండడంతో ఈ మీటింగ్ వాయిదా వేశారని అంటున్నారు. అందరూ అందుబాటులోకి రాగానే ఈ సమావేశం నిర్వహించేలా మరో తేదీని సూచిస్తారని తెలుస్తుంది.

Tollywood meeting postponed once again:

Tollywood producers meeting postponed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ