రవితేజ - రమేష్ వర్మ కాంబోలో రాబోతున్న ఖిలాడీ పై అంచనాలు పెంచేలా ఉన్నాయి ప్రమోషన్స్. ఫిబ్రవరి 11న తెలుగు, హిందీ లో భారీగా విడుదల కాబోతున్న ఖిలాడీ మూవీ నుండి ట్రైలర్ ని రిలీజ్ చేసింది టీం. ఇప్పటివరకు ఖిలాడీ పోస్టర్స్, మాస్ సాంగ్స్ తోనే అంచనాలు రేపిన ఖిలాడీ మేకర్స్.. ట్రైలర్ తో ఇంకెలా మెస్మరైజ్ చేసారో.. చూసేద్దాం. ఖిలాడీ ట్రైలర్ లోకి వెళితే.. ఎప్పుడూ ఒకే టీం లో ఆడడానికి నేషనల్ ప్లేయర్ ని కాదు, ఐపీఎల్ ప్లేయర్. ఎవడు ఎక్కువకి పాడుకుంటే వాడికే ఆడతాను అంటూ రవితేజ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలయ్యింది. యాక్షన్ సీక్వెన్స్ తో రవితేజ ఎంట్రీ ఇచ్చాడు. భారీగా విలన్ సెటప్ మధ్యన జైల్లో ఉన్న రవితేజ ని చూపిస్తూ.. వెంటనే జాలిగా, జోవియల్ గా ఉన్న రవితేజని పరిచయం చేసారు.
మోహన్ గాంధీ అని రవితేజ పేరు చెప్పగానే.. చంద్రకళ కేరెక్టర్ అనసూయ గాంధీ పేరు పెట్టుకున్న బిన్ లాడెన్ అబ్బాయి ఆడు అంటూ చెప్పే డైలాగ్ తో హీరోయిన్స్ ఎంట్రీ ఉంది. హీరోయిన్స్ ఇద్దరూ గ్లామర్ గా కనిపిస్తున్నారు. పాపేమో కసక్కు, నేనేమో ఫసక్కు అంటూ రవితేజ చెప్పే డైలాగ్స్, దూరం దూరం.. మాదసలే మడి ఆచారం అని అనసూయ అంటే.. మాది దగ్గరగా ఉండే ఆచారం అని రవితేజ ఇచ్చే కౌంటర్, మాస్ సాంగ్స్, హీరోయిన్స్ గ్లామర్ షో అన్ని పక్కా మాస్ మసాలా కంటెంట్ కలర్ లో ఉన్నాయి. అయితే మొత్తంగా చూస్తే.. కథేమిటో రివీల్ అవ్వకుండా కన్ఫ్యూజ్ చేస్తూనే, సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని ఎష్టాబ్లిష్ అయ్యేలాగా ట్రైలర్ కట్ చేసారు.
సాంగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. హీరోయిన్స్ గ్లామర్ కావాల్సినంతగా ఉంది. డింపుల్ హయతి మీనాక్షి చౌదరి స్కిన్ షో విషయంలో పెద్దగా సిగ్గు పడలేదు. రవితేజ మాస్ మహారాజ్ ఇమేజ్ కి తగ్గ సెటప్ అంతా సెట్ అయ్యింది కానీ, కథలో మేటర్ ఏమిటి.. సినిమాలో విషయం ఏమిటి అనేది మాత్రం గుప్పెట విప్పకుండానే ట్రైలర్ ముగించేశారు రమేష్ వర్మ. మళ్ళీ ఫాన్స్ అండ్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారో లేదో అని ఫైనల్ గా ఆయనకే డౌట్ వచ్చినట్టు ఉంది.. అందుకే మీరు కన్విన్స్ అయ్యారు కదండీ అంటూ ఫన్ టచ్ తో ట్రైలర్ ఎండ్ చేసారు. ఏదైతేనేం ప్రస్తుతానికి ఈ ట్రైలర్ తో కన్విన్స్ అవుదాం, బట్ ఇప్పుడు కన్విన్స్ అవడం ఇంపార్టెంట్ కాదు, ఫిబ్రవరి 11 న ఇంప్రెస్ అవడం ఇంపార్టెంట్. మరి పేకాటలో నలుగురు కింగ్స్ ఉంటారు. ఈ ఆటలో ఒక్కడే కింగ్ అంటోన్న మాస్ మహారాజ్ ఇంతకీ ఏ గేమ్ ఆడాడో... ఎంత గెలుచుకుంటాడో మార్నింగ్ షో పడ్డాక మాట్లాడుకుందాం.!