Advertisementt

బేబీ బంప్ తో కాజల్

Mon 07th Feb 2022 05:22 PM
kajal aggarwal,pregnancy glow,dubai,kajal,gautham  బేబీ బంప్ తో కాజల్
Kajal Aggarwal flaunts her baby bump బేబీ బంప్ తో కాజల్
Advertisement
Ads by CJ

గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ వయసు పెరిగినా.. ఆమెలోని అందం ఇసుమంతైనా తగ్గింది లేదు. సీనియర్ హీరోలతో జోడి కట్టినా గ్లామర్ షో విషయంలోనూ, ఫిట్ నెస్ విషయంలోనూ కాజల్ అగర్వాల్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. పెళ్లి అయినా.. చిరు ఆచార్య పూర్తి చేసింది, నాగార్జున ఘోస్ట్ మొదలు పెట్టింది. కానీ మధ్యలో కాజల్ ప్రెగ్నెంట్ అవ్వడంతో.. ఆమె నటిస్తున్న సినిమాల నుండి అర్ధాంతరంగా తప్పుకుంది. నాగార్జున ఘోస్ట్, కమల్ హాసన్ భారతీయుడు 2 నుండి కాజల్ తప్పుకోవడంతో ఆమె ప్లేస్ లోకి వేరే హీరోయిన్స్ వచ్చారు. కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు తో ఏడడుగులు నడిచినా కమిట్మెంట్స్ విషయంలో వెనక్కి తగ్గలేదు. 

అయితే కాజల్ ప్రెజెంట్ అయ్యాక చాలా రోజులు ఈ విషయాన్ని బయట పెట్టలేదు. కాజల్ కూడా బయట కనిపించలేదు. రీసెంట్ గానే భర్త గౌతమ్ కిచ్లు కాజల్ ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసారు. అప్పుడు కాజల్ బుల్లి బేబీ బంప్ తో కనిపించింది. అయితే తాజాగా కాజల్ అగర్వాల్ దుబాయ్ వెకేషన్స్ కి వెళ్ళింది. అక్కడ బీచ్ సైడ్ బంగ్లాలో కాజల్ ఎల్లో కలర్ డ్రెస్ లో కళ్ళకి కళ్ళ జోడుతో ఎప్పటిలాగే క్యూట్ నెస్ తో, చిరునవ్వులు చిందిస్తూ ఉన్న కాజల్ బేబీ బంప్ హైలెట్ అయ్యింది. ప్రస్తుతం కాజల్ బేబీ బంప్ ఫొటోస్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. 

Kajal Aggarwal flaunts her baby bump:

Kajal Aggarwal Looks Picture Perfect As She Basks In Her Pregnancy Glow In Dubai

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ