కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంత హడావిడి మరణాలు థర్డ్ వేవ్ లో లేవు. అలా వచ్చి ఇలా పోయింది. పలు రాష్ట్రాలు ముందు జాగ్రత్తగా నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్ డౌన్స్ పెట్టాయి. అవి కూడా ఇప్పుడు ఆంక్షలు ఎత్తేసాయి. ఎందుకంటే కరోనా థర్డ్ వేవ్ శాంతించింది. పెద్దగా ప్రతాపం చూపలేని కారణం ఆంక్షలు ఎత్తేసి.. స్కూల్స్, థియేటర్స్, పార్కులు, పబ్బులు అన్ని ఓపెన్ చేసేసారు. ముఖ్యంగా విద్యా సంస్థలు. ఇక ఏపీ ప్రభుత్వం కూడా ఆంధ్రాలో నైట్ కర్ఫ్యూలు పెట్టింది. కానీ విద్యా సంస్థలకి ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు.
కరోనా థర్డ్ వేవ్ వచ్చినా కేవలం నైట్ కర్ఫ్యూ, థియేటర్స్ లో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ తప్ప మిగతా ఎక్కడా ఆంక్షలు విధించలేదు. అక్కడ కూడా కరోనా భారీగా తగ్గుముఖం పట్టింది. మరి ఇప్పటికైనా నైట్ కర్ఫ్యూలు ఎత్తేయ్యోచ్చు కదా అంటున్నారు సినిమా వాళ్ళు. ఇప్పటివరకు సినిమా లు విడుదల చెయ్యకుండా ఉన్నారు. కానీ ఈ వారం పెద్ద ఎత్తున సినిమాలు రిలీజ్ కి రంగం సిద్ధమైంది. మరి కరోనా తగ్గినా ఆంక్షలు అంటూ ఫిబ్రవరి 14 వరకు నైట్ కర్ఫ్యూ ఎందుకు.. ఎత్తేయ్యోచ్చు కదా అనేది ఇండస్ట్రీ అభిప్రాయం. కానీ ఎవరూ బయట పడి అడగరు.