ఈ రోజు ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో దిగ్గజ గాయని లతా మంగేష్కర్ అనారోగ్య కారణాలతో ముంబై లోని క్యాండీ ఆసుపత్రిలో కన్ను మూసారు. గత నెల 8 న కోవిడ్, న్యుమోనియా కారణాలతో ఆసుపత్రిలో చేరిన లతాజీ ఈరోజు పరిస్థితి విషమించడంతో మరణించారు. లతా మంగేష్కర్ అంత్యక్రియలని మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని ప్రకటించారు. ముంబై ఆసుపత్రి నుండి లతా మంగేష్కర్ ఇంటికి ఆమె పార్థివ దేహాన్ని తరలించారు. అక్కడ జాతీయ పతాకాన్ని కప్పి నివాళులు అర్పించారు. అనంతరం లతా భౌతిక కాయాన్ని ముంబైలోని శివాజీ నేషనల్ పార్క్ కి తరలించారు అక్కడ ప్రధాని మోడీ తో సహా సినీ, రాజకీయ ప్రముఖులు లతా మంగేష్కర్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
వేలాదిగా తరలి వచ్చిన లతా అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు లతా భౌతిక కాయానికి నివాళులర్పించి లతా కుటుంబ సభ్యులని ఓదార్చారు. సచిన్ టెండూల్కర్ తన భార్య తో సహా నివాళులర్పించగా.. షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, జావేద్ అక్తర్, శంకర్ మహదేవన్ లాంటి ప్రముఖులు నివాళులర్పించారు. తదనంతరం లతా మంగేష్కర్ కి అశ్రునయనాల మధ్యన అధికారిక లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించారు.