ప్రభాస్ - పూజ హెగ్డే కలయికలో రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ మూవీ మార్చ్ 11 న వరల్డ్ వైడ్ గా భారీగా రిలీజ్ కి సిద్ధమవుతోంది. భారీ అంచనాలున్న రాధే శ్యామ్ థియేట్రికల్ బిజినెస్, నాన్ థియేట్రికల్ బిజినెస్ అన్ని రికార్డ్ స్థాయిలో జరగడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ రాధే శ్యామ్ పై మరింతగా అంచనాలు పెంచేసాడు. రాధే శ్యామ్ కి నేపధ్య సంగీతం అందించిన థమన్.. రాధే శ్యామ్ సినిమాకి నేపధ్య సంగీతం అందించింది డబ్బులు కోసం కాదని, యువీ నిర్మాతలతో తనకున్న అనుబంధం కోసం వర్క్ చేసానని, తాను డల్ పొజిషన్ లో ఉండగా యువీ వారు తనకు భాగమతి, మహానుభావుడు సినిమాలకి పని చేసే అవకాశం ఇచ్చారని చెప్పాడు.
అప్పట్లో ఆ రెండు సినిమాలకి మ్యూజిక్ అందించడంతో ఇప్పుడు తన కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది అని అందుకే రాధే శ్యామ్ కి పని చేసి ఆ ఋణం ఇలా తీర్చుకున్నాను అని అన్నాడు. అయితే రాధే శ్యామ్ సినిమా చూస్తున్నంత సేపు తాను ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను అని, ఒక అద్భుత ప్రేమ కావ్యం చూసిన ఫీలింగ్ కలిగింది అని, సినిమా రిలీజ్ అయ్యాక ప్రతి ఆడియెన్ ఇదే మాట చెబుతారని, రాధే శ్యామ్ లవ్ స్టోరీలో నిజాయితీ ఉంది అని చెప్పాడు.
అంతేకాకుండా ప్రభాస్ - పూజ హెగ్డే కెమిస్ట్రీ సినిమాకే హైలెట్ అని, వాళ్ళ కెమిస్ట్రీ సూపర్ అని థమన్ రాధేశ్యామ్ పై రివ్యూ ఇవ్వడంతో.. ఇప్పుడు ప్రభాస్ ఫాన్స్ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని కాచుకుని కూర్చున్నారు.