Advertisementt

బిగ్ బాస్ తర్వాత మొదటిసారి షణ్ముఖ్ అలా

Sun 06th Feb 2022 04:44 PM
shanmukh,dance performance,on bb jodi,bb jodi event  బిగ్ బాస్ తర్వాత మొదటిసారి షణ్ముఖ్ అలా
Shanmukh Dance Performance on BB Jodi Event బిగ్ బాస్ తర్వాత మొదటిసారి షణ్ముఖ్ అలా
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 లోకి టైటిల్ ఫెవెరెట్ గా దిగిన షణ్ముఖ్ జస్వంత్ సిరి స్నేహంతో అటు టైటిల్ కోల్పోవడమే కాదు.. అభిమానుల నుండి నెగెటివిటి మూట గట్టుకున్నాడు. బిగ్ బాస్ లో ఉండగానే షణ్ముఖ్ ని చాలామంది విమర్శించారు. ఇక బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక షణ్ముఖ్ ని గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది. దీప్తి సునయన షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసింది. అయితే బిగ్ బాస్ నుండి ప్రతి వారం ఎలిమినేట్ అయిన వారు, ఇంకా టాప్ 5 లో ఉన్నవారు ఎడా పెడా ఛానల్స్ కి ఇంటర్వ్యూ లు ఇవ్వడం, అలాగే స్టార్ మా ప్రోగ్రామ్స్ లో సందడి చెయ్యడం చూసాం. కానీ షణ్ముఖ్ మాత్రం బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక ఏ ఛానల్స్ లోనూ కనిపించలేదు. అలాగే స్టార్ మా ప్రోగ్రామ్స్ లోకి రాలేదు. 

రీసెంట్ గా జరిగిన స్టార్ సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రాం లో విన్నర్ విజె సన్నీ కూడా కనిపించాడు కానీ రన్నర్ షణ్ముఖ్ మిస్ అయ్యాడు. ఇక పర్సనల్ ప్రొబ్లెమ్స్ తో సఫర్ అయిన షణ్ముఖ్ కెరీర్ లో మాత్రం బిజీ అయ్యాడు. ఓ వెబ్ సీరీస్ స్టార్ట్ చేసాడు. అయితే ఇప్పుడు షణ్ముఖ్ స్టార్ మా లో జరిగిన BBజోడి ప్రోగ్రాంలో మెరిశాడు. మంచి డాన్స్ తో స్టార్ మా స్టేజ్ పై దున్నేసాడు. యాంకర్ రవి షణ్ముఖ్ ని ఇరికించే ప్రయత్నం చేసాడు. లవ్ ఈజ్ వార్ అన్నావ్ మరి ఇప్పుడు అని రవి అడిగిన ప్రశ్నకు షణ్ముఖ్ తెల్లమొహం వేసిన ఎక్సప్రెషన్, పోయే పోయే లడికి పోయే సాంగ్ కి షణ్ముఖ్ డాన్స్.. అన్ని BBజోడి లో హైలెట్ కాబోతున్నాయి. ఈ BBజోడి ప్రోగ్రాం ఈ నెల 13 ఈవెనింగ్ వాలెంటీటైన్స్ డే స్పెషల్ గా స్టార్ మా ప్రసారం కాబోతుంది. 

Shanmukh Dance Performance on BB Jodi Event:

BB JODi Event on 13th FEB

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ