Advertisementt

యాక్షన్ మోడ్ లో మెగాస్టార్

Sun 06th Feb 2022 12:05 PM
chiranjeevi,chiru,bhola shankar,godfather,mohan raja,covid 19,meher ramesh  యాక్షన్ మోడ్ లో మెగాస్టార్
Megastar in Action Mode యాక్షన్ మోడ్ లో మెగాస్టార్
Advertisement
Ads by CJ

సంక్రాంతి పండగ, అలాగే కరోనా థర్డ్ వేవ్ వలన అక్కడక్కడా షూటింగ్స్ వాయిదా పడినా.. మెగాస్టార్ చిరు మాత్రం తన సినిమాల షూటింగ్స్ చేస్తూనే ఉన్నారు. కానీ మధ్యలో చిరు కి కరోనా పాజిటివ్ రావడంతో.. హోమ్ క్వారంటైన్ లోనే రెస్ట్ తీసుకున్న మెగాస్టార్ మళ్ళీ యాక్షన్ మోడ్ లోకి దూకేశారు. కరోనా నెగెటివ్ రావడంతో చిరు మళ్ళీ తాను చేస్తున్న షూటింగ్స్ లోకి దిగిపోయారు. మెహర్ రమేష్ తో భోళా శంకర్ షూటింగ్, అలాగే మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సెట్స్ లోకి మెగాస్టార్ అడుగుపెట్టారు. గాడ్ ఫాదర్ షూటింగ్ లో చిరు నయనతార కాంబో సీన్స్ షూట్ చేస్తున్నారు.

రెండు రోజుల క్రితమే నయనతార గాడ్ ఫాదర్ సెట్స్ లోకి అడుగుపెట్టారు. మెగాస్టార్ కి చెల్లెలిగా నయనతార ఈ సినిమాలో నటిస్తుంది. ఇక మెహెర్ రమేష్ భోళా శంకర్ చిత్రీకరణలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్టుగా సమాచారం. మెహర్ రమేష్ తో చిరు, కీలక పాత్రధారులు బ్రహ్మాజీ, సత్యదేవ్, మోహన్ రాజ్ తో చిరు కలిసి ఆయా సినిమాల సెట్స్ లో ఉన్న పిక్స్ తో అప్ డేట్స్ ఇచ్చారు మేకర్స్. ఇక చిరు నటించిన ఆచార్య ఏప్రిల్ 29 న రిలీజ్ అవుతుండగా.. భోళా శంకర్, గాడ్ ఫాదర్, బాబీ వాల్తేరు వీరయ్య  సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక వెంకీ కుడుములు మూవీ స్క్రిప్ట్ పనుల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది.  

Megastar in Action Mode :

Chiranjeevi is back in action

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ