ఈమధ్యన ఏ ఇండస్ట్రీ లో అయినా.. విడిపోయి విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువగా కనబడుతున్నారు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తన రెండో భార్యకి విడాకులిస్తే.. టాలీవుడ్ లో నాగ చైతన్య సమంత కి డివోర్స్ ఇచ్చాడు. ఇక కోలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య - ధనుష్ లు రీసెంట్ గా విడిపోయారు. ఇప్పుడు అదే కోవలోకి మరో స్టార్ కపుల్ రాబోతున్నట్లుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. వారెవరో కాదు.. గత ఏడాది బ్లూ ఫిలిమ్స్ కేసులో కొన్నాళ్ళు జైలు పాలైన రాజ్ కుంద్రా నటి శిల్పా శెట్టి లు ఆఫీషియల్ గా విడిపోతున్నారని అంటున్నారు.
అందుకే రాజ్ కుంద్రా కొన్ని ఆస్తులని విడాకులు తీసుకోబోతున్న భార్య శిల్పా శెట్టి పేరు మీదకి మార్చారని అంటున్నారు. రెండు రోజుల క్రితమే రాజ్ కుంద్రా శిల్పా శెట్టి పేరు మీదకి కోట్ల విలువైన ఆస్తులని మార్చారని, 39 కోట్ల విలువైన కినారాలోని బీచ్ వ్యూలో ఉన్న అపార్ట్ మెంట్ లోని మొదటి అంతస్తు మొత్తాన్ని రాజ్‌కుంద్రా శిల్పాశెట్టి పేరుపై మార్చారు. దానితో పాటు రాజ్ కుంద్రా ఫామ్ హౌస్ కు కూడా ఆమె పేరునే మార్చినట్టు సమాచారం. అయితే గతంలోనే అంటే రాజ్ కుంద్రా జైల్లో ఉన్నప్పుడు వీరిద్దరూ విడిపోతున్నారనే ప్రచారం జరిగినా అప్పుడు శిల్పా శెట్టి ఖండించింది.
రాజ్ కుంద్రా విడుదలయ్యాక రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి తో కలిసి కనిపించలేదు. ఆ తర్వాత శిల్పా శెట్టి ఎక్కువగా చెల్లి షమితా, తల్లి, తన పిల్లలతోనే ఎయిర్ పోర్ట్ లోను, వెకేషన్స్ లోను కనిపిస్తుంది తప్ప రాజ్ కుంద్రా తో కనిపించింది లేదు. అందుకే ఇప్పుడు ఈ విడాకుల మేటర్ కి బలం చేకూర్చేలా కనబడుతుంది.