Advertisementt

గీత ఆర్ట్స్ లో నందమూరి నాయకుల సందడి

Sat 05th Feb 2022 08:04 PM
allu aravind,geetha arts,balakrishna,nandamuri heroes,ntr,parasuram  గీత ఆర్ట్స్ లో నందమూరి నాయకుల సందడి
Nandamuri heroes about to make a splash in Geetha Arts గీత ఆర్ట్స్ లో నందమూరి నాయకుల సందడి
Advertisement
Ads by CJ

అల్లు అరవింద్ చూపు ఇప్పుడు నందమూరి హీరోలపై పడింది. ఎందుకంటే మెగా హీరోలు అందరూ ఇతర కమిట్మెంట్స్ తో లాక్ అయి ఉండడం వల్ల అల్లు అరవింద్ కి నందమూరి హీరోలతో సినిమాలు చెయ్యాలనే కోరిక మొదలైంది. ఇప్పటికే ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో కోసం నటసింహం నందమూరి బాలకృష్ణని తీసుకొచ్చి సర్ ప్రైజ్ చేసిన అరవింద్.. ఇప్పుడు ఆ నందమూరి హీరోలతో సినిమాలు నిర్మించాలని చూస్తున్నారు. అందులో ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నారు అరవింద్. మహేష్ తో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న పరశురామ్ కి గీత ఆర్ట్స్ తో కమిట్మెంట్ ఉంది. అలా పరశురామ్ - ఎన్టీఆర్ కాంబోలో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారు గీత ఆర్ట్స్ వాళ్ళు.

సర్కారు వారి పాట హిట్ అయితే ఎన్టీఆర్ - పరశురామ్ కాంబో షురూ అవుతుంది. ఇక బాలకృష్ణ తోనూ అల్లు అరవింద్ ఓ ప్రాజెక్ట్ అనుకుంటున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో బింబిసారా మూవీ చేస్తున్న మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో బాలకృష్ణ తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారు అరవింద్. బింబిసారా మూవీ తర్వాత మల్లిడి వశిష్ట్ - బాలయ్య కాంబో మూవీ ఉండబోతున్నట్లుగా  తెలుస్తుంది. అలా గీత ఆర్ట్స్ లో నందమూరి నాయకుల సందడికి రంగం సిద్ధం అవుతోందని సమాచారం.

Nandamuri heroes about to make a splash in Geetha Arts:

NTR - Parasuram combo on cards

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ