ఆహా నిజంగా ఆహా అనిపించే అద్భుతమైన దృశ్యం. ఆ దృశ్యం ఈ రోజు ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫిబ్రవరి 4 బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో ఫైనల్ ఎపిసోడ్. దానికి మహేష్ గెస్ట్. ఇప్పటికే స్టార్ గెస్ట్ తో అన్ స్టాపబుల్ షో నిజంగా అన్ స్టాపబుల్ ఎంటర్టైనర్ గా నిలిస్తే.. బాలయ్య - మహేష్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఫిబ్రవరి 4 శుక్రవారం రాత్రి 8 ఎప్పుడవుతుందా అని బాలయ్య ఫాన్స్ మాత్రమే కాదు.. ఘట్టమనేని ఫాన్స్ కూడా వేచి ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం టాక్ షో చేస్తున్న బాలయ్యతో మొదటిసారి టాక్ షోలో పాల్గొంటున్న మహేష్ కలిస్తే ఎలా ఉంటుంది.. ఏం మాట్లాడుకుంటారు.. ఈ ఎపిసోడ్ లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.. ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది.. ఇలా ఫాన్స్, ప్రేక్షకులు చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. ఆహా ఓటిటి టీమ్ కూడా ఇప్పటివరకు ఓ ఎత్తు - ఈ ఎపిసోడ్ ఒక్కటీ ఒక ఎత్తు అన్నట్టుగా ప్లాన్ చేసారు.
ముందుగా బాలకృష్ణ పాత చిత్రాలతో పరిచయం చేస్తూ.. ఆయన టాక్ షో కి వచ్చి, ఆడియన్స్ మధ్యలో కూర్చుని వారితో మట్లాడుతూ గెస్ట్ మహేష్ కి స్వాగతం చెప్పడం, మహేష్ చాలా హుందాగా షో కి ఎంటర్ అవడమే కాదు.. బాలయ్య అల్లరి ప్రశ్నలకి అందంగా జవాబులు చెప్పడం హైలెట్ గా నిలిచింది. హ్యాండ్సమ్, హ్యాండ్సమ్ అనడం కాదు.. నిజంగా మహేష్ ని ఏ యాంగిల్ లో చూసినా.. ఎంతటి అందగాడు అనేంతటి లుక్ లో చాలా అంటే చాలా స్టైలిష్ గా సింపుల్ గా కనిపించాడు. బాలయ్య మాత్రం చిన్నపిల్లాడిలా మహేష్ కి మర్యాద ఇస్తూ షో ని హ్యాండిల్ చెయ్యడం ఆకట్టుకుంది.
మహేష్ ని ఫ్యామిలీ, పర్సనల్, కెరీర్ కి సంబందించిన ప్రశ్నలు అడిగారు బాలయ్య. మహేష్ కూడా సరదాగా సమాధానాలు చెప్పారు. తన పిల్లల్లో ఏదైనా డిజప్పాయింట్ విషయం జరిగితే గౌతమ్ నార్మల్ గా ఉన్నా, సితార మాత్రం ఇల్లు పీకి పందిరి వేస్తుంది అని, గౌతమ్, సితార లు ఫ్లైట్ లో విండో సీట్ కోసం కొట్టుకుంటారని, అలాంటి చిన్న చిన్న దెబ్బలాటలు ఉంటాయని, అలాగే తండ్రి కృష్ణ తో మహేష్ చేసిన సినిమాల గురించి, మహేష్ రేర్ పిక్చర్స్, బాలయ్యకి సర్ ప్రైజ్ ఇస్తూ ఆహా టీం వేసిన రేర్ పిక్స్, ఇంకా మహేష్ తో పని చేసిన డైరెక్టర్స్ అనిల్ రావిపూడి కి మహేష్ మధ్యన ఫన్నీ ఇన్సిడెంట్, డైరెక్టర్ శంకర్ కూతురు వచ్చి సెల్ఫీ అడిగితే అది తెలియని మహేష్ ఫ్యామిలీ తో లంచ్ కి వచ్చాం ప్లీజ్ అని పంపేసి, తరువాత మెహెర్ రమేష్ శంకర్ డాటర్ అని చెప్పడంతో.. ఆయన దగ్గరకి వెళ్లి సారీ మీ పాప అని తెలియదు అనగానే.. పర్వాలేదు, వాళ్ళకీ తెలియలిగా హీరోలు ఎలా ఉంటారో అని చాలా మాములుగా చెప్పడం, ఇక కొరటాల శివ తో భరత్ అనే నేను టైం లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ అబ్బో.. అన్ స్టాపబుల్ షో లో నిజంగానే మహేష్ అన్ స్టాపబుల్ అనిపించేసాడు.
చివరిగా వంశి పైడిపల్లి రావడం, మహేష్ తో తనకి స్నేహం ఎలా ఏర్పడిందో చెప్పడం, తర్వాత మహేష్ తో ఓ ఫన్నీ గేమ్ ఆడడం.. చివరిగా మహేష్ చేయించిన గుండె ఆపరేషన్స్ విషయం షో లో పంచుకోవడం, మహేష్ ఫన్నీ సెటైర్స్ ఇవన్నీ ఆహా అన్ స్టాపబుల్ ఫినాలే ఎపిసోడ్ కి హైలెట్ గా నిలిచాయి. ఆహా టీం.. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ని నిజంగానే గ్రాండ్ గా డిజైన్ చేసి ఆహా అనిపించారు. షో ఫినిషింగ్ లో బాలయ్యబాబుకి ఇచ్చిన ట్రిబ్యూట్ అయితే నందమూరి ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి.