Advertisementt

నేను చాలా డేంజరస్ - మోహన్ లాల్

Fri 04th Feb 2022 08:23 PM
mohanlal,malayala actor,aaraattu movie,aaraattu trailer,telugu dialogue,dhirshyam 2,bro daddy  నేను చాలా డేంజరస్ - మోహన్ లాల్
I am very Dangerous- Mohanlal నేను చాలా డేంజరస్ - మోహన్ లాల్
Advertisement
Ads by CJ

ఈమధ్యన ఎక్కువగా ఎక్సపెరిమెంటల్ మూవీస్ చేస్తున్న మలయాళ నటుడు మోహన్ లాల్.. మళ్ళీ మన్యం పులి తరహాలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఫిలిం ఆరాట్టు చేశారు. అది పక్కా మాస్ యాక్షన్ మూవీ. ఆ తరహా సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ కి గుర్తొచ్చేలా ఫుల్ కమర్షియల్ ఫిలిం చేసారు. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ చెయ్యబోతున్నారు మేకర్స్. గత కొంత కాలంగా మోహన్ లాల్ తన సినిమాల్ని ఓటిటి ద్వారా రిలీజ్ చేస్తున్నారు. దృశ్యం 2 కానివ్వండి, మరక్కార్ కానివ్వండి, రీసెంట్ గా పృథ్వి రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రో డాడీ.. ఇలా మోహన్ లాల్ నటించిన సినిమాలు చాలావరకు ఓటిటి బాట పట్టాయి. 

తాజాగా మోహన్ బిగ్ స్క్రీన్ మీద కనిపించబోయే సినిమా ఆరాట్టు. ఇంకో విశేషం ఏమిటి అంటే ఈ మలయాళ సినిమాలో మోహన్ లాల్ నోట తెలుగు మాట వినిపించడం. విలన్స్ కి వార్నింగ్ ఇచ్చే సందర్భంలో మోహన్ లాల్ నేను చాలా డేంజరస్ అంటూ తెలుగు డైలాగ్ చెప్పడం విశేషం. ఆరాట్టు నుండి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఆరాట్టు ట్రైలర్ లో మోహన్ లాల్ యాక్షన్, ఆయన లుక్స్, మోహన్ లాల్ స్టయిల్ సూపర్బ్ అనేలా ఉన్నాయి. మరా ట్రైలర్ లో మోహన్ లాల్ చెప్పిన తెలుగు డైలాగ్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడే. జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ కి పెదనాన్నగా కీలక పాత్రలో కనిపించారు కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్. అలాగే ఆయన మలయాళ సినిమాలు తెలుగులోనూ డబ్ అవుతుంటాయి. అలాంటి టాప్ మలయాళ నటుడి నోట మలయాళ సినిమాలో తెలుగు మాట వినగానే తెలుగు ప్రేక్షకులు పులకించిపోతున్నారు. 

I am very Dangerous- Mohanlal:

Mohanlal Aaraattu Trailer release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ