బాలీవుడ్ సొట్ట బుగ్గల చిన్నది అలియా భట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. గంగూభాయ్ కతీయవాడి అంటూ పెరఫార్మెన్స్ లో, లుక్స్ లో అదరగొట్టేసింది అలియా భట్, బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న అలియా భట్ రామ్ చరణ్ తో ఆర్.ఆర్.ఆర్ లో నటించింది. ఆ సినిమా పాన్ ఇండియా మార్కెట్ లో విడుదలకు సిద్ధం గా ఉంది. ఆ తర్వాత యంగ్ టైగర్ తో అలియా భట్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న NTR30 లో నటిస్తుంది. మరి బ్యాక్ టు బ్యాక్ సౌత్ సినిమాలు ఒప్పుకున్న అలియా భట్ కి ఇప్పుడు మరో టాలీవుడ్ టాప్ స్టార్ తో నటించాలనే కోరికని బయటపెట్టింది. ఇది తన కోరిక కాదండోయ్.. అలియా ఫ్యామిలీ మెంబెర్స్ కోరికట.
అలియా భట్ రీసెంట్ గా తన ఫ్యామిలీ తో కలిసి అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాని అమెజాన్ ప్రైమ్ లో వీక్షించింది. అయితే పుష్ప లో అల్లు అర్జున్ ని చూసిన అలియా భట్ ఫ్యామిలీ మెంబెర్స్ ఆలు అల్లు అర్జున్ తో సినిమా ఎప్పుడు చేస్తున్నావ్ అని అడిగారట. ఈ విషయాన్ని అలియా భట్ గంగూభాయ్ కతీయవాడి ప్రమోషన్స్ లో చెప్పింది. అల్లు అర్జున్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. ఇది నా ఇష్టం మాత్రమే కాదు.. మా ఫ్యామిలీ మెంబెర్స్ డిమాండ్ కూడా అని, అల్లు అర్జున్ పుష్ప చూసాక తన ఫ్యామిలీ మొత్తం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయ్యారని, నన్ను ముద్దుగా అందరూ ఆలు అని పిలుస్తారని, ఆలు అల్లు తో సినిమా ఎప్పుడు చేస్తున్నావ్ అంటూ అడుగుతున్నారని, అల్లు తో చేసే అవకాశం వస్తే అస్సలు వదులుకోను అంటూ అలియా భట్ ఆలు ఆల్వేస్ రెడీ ఫర్ అల్లు అన్నట్టుగా చెప్పుకొచ్చింది.