స్టార్ డైరెక్టర్ లేకపోయినా ప్రభాస్ పాన్ ఇండియా పవర్ మాత్రం బాగా పని చేస్తోంది. సాహో ని తెరకెక్కించింది యంగ్ డైరెక్టర్ సుజిత్. ఆ సినిమా అన్ని భాషల్లో డిస్పాయింట్ చేసినా కూడా.. ప్రభాస్ స్టామినాతో నార్త్ లో భీభత్సమైన కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇపుడు ప్రభాస్ తో అప్ కమింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ రాధేశ్యామ్ తీసినా.. అది కూడా ప్రభాస్ స్టామినాతోనే ఎంటైర్ ఇండియా లో హ్యూజ్ క్రేజ్ తెచ్చుకుంది. ఒక్క ఇండియా లోనే 6000 స్క్రీన్స్ లో రాధేశ్యామ్ రిలీజ్ అవుతుందనీ.. వరల్డ్ వైడ్ గా దాదాపు 10 వేల థియేటర్స్ లో మార్చి 11 న స్క్రీనింగ్ జరగనుందనీ అంటున్నారు.
అలాగే రాధేశ్యామ్ నాన్ థియేట్రికల్ రైట్స్ లోను రికార్డ్ సృష్టించింది. శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ నిమిత్తం దాదాపు 230 కోట్లు దక్కించుకుంది రాధేశ్యామ్. హిందీ వెర్షన్ డిజిటల్ హక్కులని నెట్ ఫ్లిక్స్ తీసుకోగా .. మిగతా అన్ని భాషల శాటిలైట్ అండ్ డిజిటల్ హక్కులని జీ 5 సొంతం చేసుకుంది. బాహుబలి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ రికార్డు డీల్ వచ్చింది రాధే శ్యామ్ కే . మరి ఇదంతా కేవలం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టామినా వలనే సాధ్యం అయ్యింది అనడంలో సందేహం లేదుగా.!