టాలీవుడ్ లో మళ్ళీ థియేటర్స్ దగ్గర జన సందోహం, బాక్సాఫీసు దగ్గర ప్రేక్షకుల హడావిడి మొదలైపోయింది. థర్డ్ వేవ్ భయాలతో వాయిదాలు వేసుకున్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అలాగే చాలా సినిమా రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్నాయి. పాన్ ఇండియా మూవీస్, భారీ బడ్జెట్ మూవీస్, చిన్నా చితక, మీడియం బడ్జెట్ సినిమాలన్నీ వారానికి రెండు మూడు సినిమాల చొప్పున బాక్సాఫీసు యుద్దానికి సిద్దమైపోయాయి. మరి అందరూ రిలీజ్ డేట్స్ ఇస్తున్నారు.. మనము పరిస్థితుల బట్టి రిలీజ్ డేట్ ఇద్దామని రెండు రోజుల క్రితం ప్రకటించిన అడవి శేష్ కూడా తన సినిమా మేజర్ రిలీజ్ డేట్ ఇచ్చేసాడు.
ఫిబ్రవరి 11 న మేజర్ పాన్ ఇండియా మార్కెట్ లో దిగబోతుంది అని గతంలో డేట్ ప్రకటించిన శేష్.. థర్డ్ వేవ్ దెబ్బకి ఆయన కూడా వాయిదా వేసుకున్నాడు. తాజాగా మేజర్ మే 27 న రిలీజ్ కాబోతున్నట్టుగా డేట్ ప్రకటించేసారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించబడింది, తెలుగు, హిందీ తో పాటుగా మలయాళంలో కూడా విడుదల కానుంది. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మేజర్ టీం తలముమనకలై ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి మంజ్రేకర్, అలాగే కీలక పాత్రలో శోభిత దూళిపాళ్ల నటిస్తుండగా.. ఈ సినిమాని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా.. మహేష్ బాబు GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు A+S మూవీస్‌తో కలిసి నిర్మించారు.