Advertisementt

తెలుగు సినిమాలకే దిక్కు లేదు, హిందీ డబ్బింగ్

Fri 04th Feb 2022 09:56 AM
gangubai kathiawadi,tollywood,bollywood,rrr,radhe shyam  తెలుగు సినిమాలకే దిక్కు లేదు, హిందీ డబ్బింగ్
Bollywood movies in Telugu release తెలుగు సినిమాలకే దిక్కు లేదు, హిందీ డబ్బింగ్
Advertisement
Ads by CJ

తెలుగు సినిమాలకే రెండు రాష్ట్రాల్లో సరయిన ఆదరణ లభించటం లేదని నిర్మాతలు, పెద్ద స్టార్స్ భయపడుతుంటే, ఇప్పుడు డబ్బింగ్  సినిమా కూడా తెలుగులో విడుదలకి సిద్ధం అయ్యింది. అదీ తమిళ్ లేక మలయాళం కాదు, హిందీ సినిమా తెలుగు లో డబ్బింగ్. అలియా భట్ నటించిన గంగూబాయి తెలుగులో విడుదల చేస్తారట. సంజయ్ లీల భన్సాలీ దీనికి దర్శకత్వం వహించారు, ఇందులో అజయ్ దేవగన్ కూడా ఒక కీలక రోల్ ప్లే చేస్తున్నారు. అదీ కాకుండా మన పెద్ద సినిమాలు విడుదల అవుతున్న సమయంలోనే ఈ డబ్బింగ్ హిందీ సినిమా కూడా విడుదల అవటం విశేషం. 

నిర్మాతలు కొంతమంది మీడియా వాళ్ళని కూడా ముంబై తీసుకువెళ్లి ఈ సినిమా ట్రైలర్ చూపించారు కూడా. తెలుగులో విడుదల అంటే ట్రైలర్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చేస్తే బాగుంటుంది కదా, మరి తెలుగు డబ్బింగ్ సినిమా కూడా ముంబై లోనే విడుదల చేస్తారా. సినిమా హాల్స్ లో విడుదల అంటే అనవసర ఖర్చు తప్ప, ఏమి వొరగదు. దానికి బదులు ఓ టి టి లో విడుదల చేస్తే ఇంకా ఎక్కువ మంది చూస్తారు.

Bollywood movies in Telugu release:

Gangubai Kathiawadi telugu release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ