Advertisementt

రామ్ చరణ్ కి హీరోయిన్ దొరికేసింది

Thu 03rd Feb 2022 10:02 PM
rashmika mandanna,ram charan,rc 16,gautham tinnanuri  రామ్ చరణ్ కి హీరోయిన్ దొరికేసింది
Rashmika Mandanna to romance Ram Charan రామ్ చరణ్ కి హీరోయిన్ దొరికేసింది
Advertisement
Ads by CJ

మోస్ట్ లక్కీయస్ట్ గర్ల్ రష్మిక మందన్న వరస సక్సెస్ లతో దూసుకుపోతుంది. ఛలో, గీత గోవిందం, రీసెంట్ గా పుష్ప సినిమాలతో అద్భుతమైన హిట్స్ సాధించింది. అల్లు అర్జున్ తో కలిసి పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లో సత్తా చాటిన రష్మిక మందన్న ఇప్పుడు స్టార్ హీరోలకి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. మహేష్, అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న రష్మిక.. ఈసారి రామ్ చరణ్ తో జోడి కట్టబోతుంది. అది కూడా RC16 లో. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ తో RC15 లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ తో రొమాన్స్ చేస్తున్నాడు. 

ఇక రామ్ చరణ్ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి రో కలిసి చెయ్యబోయే పాన్ ఇండియా మూవీలో చరణ్ రష్మిక తో రొమాన్స్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే రష్మిక తో చర్చలు జరపడం ఆమె ఓకె చెప్పడం జరిగిపోయాయని తెలుస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ కి కేరాఫ్ అడ్రెస్ లా మారిన రష్మిక హీరోయిన్ అయితే సినిమాకి వెయిట్ వస్తుంది అని చరణ్ - గౌతమ్ భావించి ఆమెని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఇవి కాకుండా రష్మిక యంగ్ హీరో శర్వానంద్ తో నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే అల్లు అర్జున్ తో పుష్ప పార్ట్ 2 షూటింగ్ కి రెడీ అవుతుంది. 

Rashmika Mandanna to romance Ram Charan:

Rashmika Mandanna to romance Ram Charan for RC16

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ