ఇంచుమించు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో అందరూ మళ్ళీ కొత్త విడుదల తేదీలు ప్రకటించేసారు. ఇంకా మరికొంతమంది ప్రకటిస్తున్నారు. ఏమైనా మళ్ళీ సందడి మొదలయ్యింది, కానీ అందరికి ఒక టెన్షన్ వుంది కదా. మరి ఆంధ్ర లో ఎలా? ఏమి చేస్తారు? టికెట్ రేట్స్ పెంచుతారా? తగ్గిస్తారా? అన్న ప్రశ్న అందరిలో వస్తుంది. అయితే ఇండస్ట్రీ లో కొంతమంది పెద్దల సమాచారం ప్రకారం, ఆంధ్ర లో అంతా మార్చ్ ఫస్ట్ కి సానుకూలం అయిపోతుంది అని చెప్తున్నారు. జగన్ ప్రభుత్వం ఈ టికెట్ రేట్స్, సినిమా హాల్స్ గురించి పెద్దగా పట్టించుకోకుండా వదిలేస్తుంది అని చెప్తున్నారు.
ఈలోపు జగన్ మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి ని పిలిచి ఈ విషయాన్నే ఆయనకి చెప్తారు అని కూడా తెలుస్తుంది. అయితే ఈసారి చిరంజీవి ఒక్కరే కాకుండా మరికొంత మంది సినిమా పెద్దలు కూడా వెళ్లొచ్చు. ఆంధ్ర ప్రభుత్వం సానుకూలమయిన సందేశాలు ఇచ్చినందువల్లే అందరూ తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించారని సమాచారం. మార్చ్ ఫస్ట్ కన్నా ఇంకా ముందు అయినా మనం ఆశ్చర్యపోనక్కరలేదు అని కూడా చెప్తున్నారు. చిరంజీవి ఇందులో చాలా కీలక పాత్ర పోషించారని కూడా తెలుస్తుంది. ఆయనే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఈ సినిమా విషయమై ఎలాంటి విమర్శలు చేయొద్దని చెప్పారని కూడా అంటున్నారు.