Advertisementt

అలియా భట్ అలా కన్ ఫర్మ్ చేసింది

Thu 03rd Feb 2022 08:28 PM
alia bhatt,koratala siva,ntr 30,tarak,ntr  అలియా భట్ అలా కన్ ఫర్మ్ చేసింది
Heroine locked for NTR30 అలియా భట్ అలా కన్ ఫర్మ్ చేసింది
Advertisement
Ads by CJ

నిన్నటివరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ - సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల కాంబోలో పాన్ ఇండియా లెవల్లో తెరక్కేయబోయే NTR30 మూవీ హీరోయిన్ గా కియారా అద్వానీ పేరు, అలియా భట్ పేరు కాస్త గట్టిగానే వినిపించాయి. దాదాపుగా కియారా ఫిక్స్ అనే అన్నారు. కానీ NTR30 లో ఆర్.ఆర్.ఆర్ భామ అలియా భట్ ఫైనల్ అయ్యింది. ఆ విషయాన్ని ఆలియా భట్ కన్ ఫర్మ్ చేసింది కూడా. ఇంతకు ముందే చెప్పినట్టుగా ఎన్టీఆర్ తో వర్క్ చెయ్యడానికి అలియా భట్ చాలా ఎగ్జైట్ అవుతుంది. 

తాజాగా అలియా భట్ బాలీవుడ్ లో గంగూభాయ్ కతీయవాది ప్రమోషన్స్ లో భాగంగా ఓ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎన్టీఆర్ తో కలిసి పని చేయబోతున్నట్లుగా చెప్పేసింది. కొరటాల శివ తనని కలిసి NTR30 కథ వినిపించారని, ఆ సినిమాలో తన కేరెక్టర్ ఎలా ఉండబోతుందో నేరేట్ చేసారని, కథ వినగానే సెకండ్ థాట్ లేకుండా తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెప్పుకొచ్చింది. చాలా తక్కువ టైం లోనే తారక్ తో కలిసి మరోసారి పని చెయ్యబోతున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది అని చెప్పిన అలియా భట్ కొరటాల కి ఆల్ ద బెస్ట్ చెప్పింది. అంటే కొరటాల దర్శకత్వంలో రాబోతున్న ఆచార్య సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నట్లుగా చెప్పింది. సో అలా ఎన్టీఆర్ తో అలియా భట్ ఫిక్స్ అన్నమాట.

ఇక కొరటాల శివ - తారక్ కాంబో మూవీ ఈ నెల 7 న అధికారికంగా మొదలై.. ఈ నెల చివరి వారం నుండి రెగ్యులర్ షూట్ కి వెళ్లబోతుంది. 

Heroine locked for NTR30:

Alia Bhatt: I am in talks with Koratala Siva for NTR 30

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ