శ్యామ్ సింగ రాయ్ తో నాలుగు భాషల్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నాని.. అప్పుడే మరో సినిమాని రెడీ చేసేసాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి అనే ఎంటర్టైన్మెంట్ మూవీ చేస్తున్న నాని, రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసేసాడు. అంతేకాకుండా మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టడమే కాదు.. రిలీజ్ డేట్ విషయంలో రాజమౌళి కే పంచ్ వేసాడు. అంటే టాలీవుడ్ లో రెండు రిలీజ్ డేట్స్ ప్రకటించి సరికొత్త సంప్రదాయానికి నాంది పలికిన రాజమౌళికి నాని తన అంటే సుందరానికి ఏడు డేట్స్ ప్రకటించి పంచ్ వేసాడు. ఆర్.ఆర్.ఆర్ మార్చ్ 18 కానీ, ఏప్రిల్ 28 కానీ రిలీజ్ చేస్తామని.. చివరికి మార్చ్ 25 కి రిలీజ్ డేట్ లాక్ చేసారు.
ఇప్పుడు నాని కూడా మీరు అంతా రెండు రెండు Block చేస్తే మేము ఏడు చేయకూడదా 😉Full ఆవకాయ season blocked. Mellaga decide chestham 😎అంటూ సమ్మర్ లో రెండు మూడు నెలలని బ్లాక్ చేసేసాడు. ఏప్రిల్ 22, 29, మే 6, 20, 27 మరియు జూన్ 3 మరియు జూన్ 10 తేదీలలో ఏదో ఒక డేట్ న అంటే సుందరాన్ని రిలీజ్ చెయ్యొచ్చు అని ఆ డేట్స్ తో కూడిన ఫన్నీ పోస్టర్ తో అప్ డేట్ ఇచ్చారు. వివేక్ ఆత్రేయ అంటేనే ఫన్ రైడ్ మూవీస్. నాని తో ఈ అంటే సుందరంతో ఎంత ఫన్ జనరేట్ చేస్తారో చూడాలి. ఈ సినిమాలో నాని కి జోడిగా మళయాల బ్యూటీ నజ్రియా నటిస్తుంది. నజ్రియా అంటే సుందరానికి సినిమాతోనే తెలుగులోకి ఎంటర్ అవుతుంది.