ఆహా ఓటిటి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ ల తో పాటుగా సోషల్ మీడియాలో మార్మోగుతున్న పేరు. ఆహా నుండి పెద్ద సినిమాలు రాకపోతేనేమి.. వారానికో సినిమా ఆహా నుండి రిలీజ్ అవుతుంది. అంతేనా.. బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో తో ఆహా పేరు తెగ వైరల్ అయ్యింది. టాక్ షో ల కె బాప్ అన్నట్టుగా NBKwithUnStoppable షో ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుండి యూత్ వరకు ఊపేస్తోంది. స్టార్ హీరోలతో బాలకృష్ణ చేసే అల్లరి మెయిన్ గా హైలెట్ అవుతుంది. అన్ స్టాపబుల్ ఫస్ట్ సీజన్ ఎండ్ కాబోతుంది. అది కూడా సూపర్ స్టార్ మహేష్ ఎపిసోడ్ తో.. ఫిబ్రవరి 4 శుక్రవారం రాత్రి 8 గంటలకు స్ట్రీమింగ్ కాబోయే బాలయ్య విత్ మహేష్ ఎపిసోడ్ ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది.
బాలయ్య మహేష్ ని సిల్లీ గా, అల్లరిగా అడిగిన ప్రశ్నలకు.. మహేష్ అంతే సరదాగా, హుందాగా సమాధానాలు చెప్పడం ఈ ప్రోమోలో హైలెట్ అయ్యింది. ఇక ప్రోమోలోకి వెళితే.. ఏంటయ్యా బాబు ఇంత యంగ్ గా ఉన్నావ్ అని అడిగితే మహేష్ మాత్రం సిగ్గుపడిపోయాడు. మహేష్ గారు నాదో చిన్న కోరిక అని నా డైలాగ్ నీ గొంతు ద్వారా వినాలనుందయ్యా అని బాలయ్య అనగానే... మీ డైలాగ్ మీరు తప్ప ఎవ్వరూ చెప్పలేరు అనేశాడు మహేష్. చిన్నప్పుడు నువ్వు చాలా నాటి కిడ్ వని విన్నాను అని, చేసేవన్నీ చేస్తావ్.. మళ్ళీ చెప్పమంటే సిగ్గుపడతావ్ అన్నారు బాలయ్య. దానికి మహేష్ నవ్వేసాడు. నెంబర్ వన్ స్టార్ అవుతూ సూపర్ స్టార్ అయ్యావ్. సడన్ గా మూడేళ్లు గ్యాప్ ఎందుకు తీసుకున్నావ్ అని బాలయ్య అడగగా.. బేసిక్ గా ఆ మూడేళ్లు ఫస్ట్ నేను నన్ను కరెక్ట్ చేసుకోవడానికి గ్యాప్ తీసుకున్నాను, దాని తర్వాత మళ్ళీ తిరిగి ఆలోచించలేదు అనగా.. అన్ స్టాపబుల్ అంటూ బాలయ్య ఫన్ చేసారు.
వెకేషన్ అని చెప్పి పెళ్లి చేసుకున్నావ్ అంట ఏమిటా సీక్రెట్ అని బాలయ్య అడగగా.. మహేష్ దానికి అయ్యో అన్నట్టుగా నవ్వేశారు. మరి బాలయ్య - మహేష్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో అనేది.. జస్ట్ ఈ ప్రోమోలో చూపించారు. నిజంగానే బాలయ్య - మహేష్ బాబు ఎపిసోడ్ అన్ స్టాపబుల్ అనిపించేలా ఆహా నుండి వదిలిన ప్రమోస్ లో కనిపిస్తుంది.