ఇప్పటికే జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి రూపంలో పవన్ కళ్యాణ్ తోను, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో అంటూ అల్లు అర్జున్ తోను మూడేసి సినిమాలు చేసిన త్రివిక్రమ్ అతడు, ఖలేజా తర్వాత మహేష్ తో చేయబోయే తన మూడో సినిమాను నేడు ప్రారంభించారు. అలాగే హీరోయిన్ పూజ హెగ్డే తో కూడా ఆయనికిది మూడో చిత్రం. గతంలో సమంతతో అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ ఆ అనే మూడు మూవీస్ వరుసగా చేసిన త్రివిక్రమ్ ఇపుడు ఆ అవకాశాన్ని పూజకి ఇచ్చారు. అరవింద సమేత, అల వైకుంఠపురం చిత్రాల్లో పూజ హెగ్డే చేత నటింపచేయడమే కాక ఆమెతోనే ఓన్ డబ్బింగ్ చెప్పించిన త్రివిక్రమ్ ఈ రోజు స్టార్ట్ అయిన మహేష్ సినిమాలోనూ పూజనే హీరోయిన్ గా ఫిక్స్ చేసి తనపైనే ఫస్ట్ షాట్ తియ్యడం విశేషం. ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో ముఖ్యాంశం ఏంటంటే థమన్ మ్యూజిక్. ప్రస్తుతం ఎక్సట్రార్డినరీ ఫామ్ లో ఉన్న ఎస్ ఎస్ థమన్ కి కూడా త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఇది థర్డ్ ఫిల్మే.!
సో... ఇలా హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ ముగ్గురితోనూ ముచ్చటగా మూడో సినిమా చేస్తోన్న త్రివిక్రమ్ కి అనుకోకుండా అలా అన్ని విధాలా మూడొచ్చిందన్న మాట.!
ఏప్రిల్ లో రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానున్న ఈ హ్యాట్రిక్ ఫిల్మ్ ని వీలైనంత వేగంగా పూర్తి చేసి దసరా బరిలోకి దింపాలనేది ఇనీషియల్ ప్లాన్. 2023 సంక్రాంతి అనే ప్లాన్ B కూడా ఉందనుకోండి. ఏదేమైనా ఖలేజా మేకింగ్ లో జరిగిన జాప్యం మాత్రం ఈసారి రిపీట్ కాదనేది పక్కా.!