తమ కలయికలో సినిమా వస్తోందంటూ ముందు అధికారికంగా ప్రకటించేసి ఆపై క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటూ సుకుమార్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు మహేష్ బాబు. అయితే పట్టు వదలని సుక్కు అదే కథతో హిట్టు కొట్టి చూపించారు. అదే పుష్ప. సరిగ్గా పూరీది కూడా ఇపుడు అదే పరిస్థితి. పోకిరి వంటి బ్లాక్ బస్టర్ తో హీరోగా మహేష్ కెరీర్ కి మైల్ స్టోన్ లాంటి సినిమా ఇచ్చి బిజినెస్ మాన్ గానూ మహేష్ తో మరో సూపర్ హిట్ కొట్టించిన పూరి జనగణమన పేరుతో హ్యాట్రిక్ ఫిల్మ్ చేయాలనుకున్నారు. బట్ మహేష్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో తాను ప్లాప్స్ లో ఉండడం వలనే తనని పట్టించుకోవట్లేదు అంటూ ఓ ఇంటర్ వ్యూలో ఓపెన్ గానే అనేసారు పూరి.
ఆపై ఇస్మార్ట్ శంకర్ తో హిట్ ట్రాక్ ఎక్కిన పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా ఫిల్మ్ లైగర్ చేస్తున్నారు. బాలీవుడ్ లో కింగ్ మేకర్ గా ఎదిగిన కరణ్ జోహార్ పూరికి ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఆగస్టు 25 న విడుదల కానున్న లైగర్ ని తమ ధర్మ ప్రొడక్షన్స్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ చెయ్యనున్నారు. ఈ దశలోనే మరో ఇంట్రెస్టింగ్ డెసిషన్ తీసుకున్న పూరి ఆల్ రెడీ ఆయనకు బాగా కనెక్ట్ అయిపోయిన విజయ్ దేవరకొండతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన చేసేయాలని ఫిక్స్ అయ్యారు. కథ విన్న కరణ్ జోహార్ గో ఏ హెడ్ అన్నారు. విజయ్ కి జాన్వీని జత కలిపారు. పేట్రియాటిక్ సాంగ్స్ కి పెట్టింది పేరైన ఎ ఆర్ రహమాన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకుంటున్నారు. అంతేకాదు.. అక్టోబర్ లోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరి ఇంత వడివడిగా, కసికసిగా జనగణమన అనేందుకు ఆరాటపడుతోన్న పూరి - సుక్కు పుష్ప ఫీట్ ని రిపీట్ చేసి మహేష్ కి మరో ఝలక్ ఇస్తారంటారా..!!