పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో నాగ వంశి తెరకెక్కిస్తున్న భీమ్లా నాయక్ పై ట్రేడ్ లో భీభత్సమైన క్రేజ్, ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్, రానా లపై వదిలిన టీజర్స్, సాంగ్స్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ జనవరి 12 న సంక్రాంతికే విడుదల కావల్సిన భీమ్లా నాయక్ ని ఆర్.ఆర్.ఆర్ వాయిదా వేసినా.. మరోసారి ఆర్.ఆర్.ఆర్ కి అడ్డుపడేలా కనబడుతుంది. మార్చి 25 న ఆర్.ఆర్.ఆర్ అంటే.. మాది ఫిబ్రవరి 25 కానీ, లేదంటే ఏప్రిల్ 1 కానీ రిలీజ్ చేస్తామని భీమ్లా నాయక్ మేకర్స్ ప్రకటన ఇచ్చారు. ఏప్రిల్ 1 న అంటే ఆర్.ఆర్.ఆర్ కి మళ్ళీ ప్రాబ్లెమ్.
రెండు తేదీల్లో భీమ్లా నాయక్ దేనికి ఫిక్స్ అవుతుందో అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. తాజాగా భీమ్లా నాయక్ నిర్మాతలు ఓ ప్రెస్ మీట్ లో ఆంధ్ర లో టికెట్ రేట్స్ ఇష్యు ఎలా ఉన్నా.. అక్కడ నైట్ కర్ఫ్యూ ఎత్తేసినప్పుడే మా సినిమా రిలీజ్ అంటున్నారు. అంటే అది ఫిబ్రవరి 25 అయినా కావొచ్చు, లేదా ఏప్రిల్ 1 అయినా కావొచ్చని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మరి నిన్నటితో ముగిసిన నైట్ కర్ఫ్యూని ఆంధ్ర ప్రభుత్వం మరోసారి ఫిబ్రవరి 14 వరకు పొడిగించింది. సో ఆంధ్ర నైట్ కర్ఫ్యూతో భీమ్లా నాయక్ రిలీజ్ కి ముడి వేశారన్నమాట మేకర్స్.