కరోనా థర్డ్ వేవ్ పెద్దగా భయపెట్టకుండానే.. జస్ట్ నైట్ కర్ఫ్యూస్, వీకెండ్ లాక్ డౌన్స్ తో ముగిసింది. ఓమిక్రాన్ వేరియెంట్ అంతగా డ్యామేజ్ చెయ్యలేదు. దానితో విడుదల వాయిదాలు పడ్డ సినిమాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఓమిక్రాన్ వేరియెంట్ భయంతో నైట్ కర్ఫ్యూలు, 50 పర్సెంట్ అక్యుపెన్సీల వలన ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్, బాలీవుడ్ లో జెర్సీ లాంటి పెద్ద సినిమాలు, తమిళంలో సామాన్యుడు, వాలిమై లాంటి పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. ఇక ఓమిక్రాన్ వేరియెంట్ చల్లారడంతో.. ముందుగా టాలీవుడ్ పాన్ ఇండియా మూవీస్, బిగ్ బడ్జెట్ మూవీస్, చిన్న సినిమాల రిలీజ్ డేట్స్ ఇచ్చేసి ఇండస్ట్రీలో పండగ వాతారణాన్ని తెచ్చింది.
రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మార్చ్ 25, రాధే శ్యామ్ మార్చ్ 11 అని, ఆచార్య ఏప్రిల్ 29 అని, భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 అని, ఇంకా ఎఫ్3 ఏప్రిల్ 28 అని, సర్కారు వారి పాట మే 12 అంటూ రిలీజ్ డేట్స్ లాక్ చేసి పెట్టేసారు. మరి ఇప్పుడు టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ కూడా త్వరపడాలి. ఎందుకంటే పాన్ ఇండియా మూవీస్ హిందీలోనూ రిలీజ్ అవుతాయి. అలాగే ఆచార్య కూడా హిందీలో రిలీజ్ అవుతుంది. ఇక అక్కడి జెర్సీ, గంగూబాయి కతియవాది లాంటి సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతాయి. అలాంటిది టాలీవుడ్ డేట్స్ లాక్ చేసి పెట్టినా బాలీవుడ్ సైలెంట్ గానే ఉంది. మరి మంచి డేట్స్ అన్ని టాలీవుడ్ నొక్కేసింది. ఇప్పుడు రిలీజ్ డేట్స్ ఇవ్వడానికి బాలీవుడ్ అన్ని వెతుక్కోవాల్సి వస్తుంది.