Advertisementt

సర్కారు వారి పాటపై ఇంట్రెస్టింగ్ న్యూస్

Wed 02nd Feb 2022 03:42 PM
mahesh babu,keerthy suresh,parasuram,sarkaru vaari paata  సర్కారు వారి పాటపై ఇంట్రెస్టింగ్ న్యూస్
Interesting News on Sarkaru Vaari Paata Movie సర్కారు వారి పాటపై ఇంట్రెస్టింగ్ న్యూస్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు - పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట ఇప్పట్లో రావడం లేదు. సమ్మర్ స్పెషల్ గా మే 12 న సర్కారు వారి పాట రిలీజ్ డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం హైదరాబాద్ లో సర్కారు వారి పాట కొత్త షెడ్యూల్ మొదలు పెట్టారు. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు ఇంకా పాల్గొనడం లేదు. ఫిబ్రవరి రెండో వారం నుండి మహేష్ షూటింగ్ లో జాయిన్ అవుతారు. మార్చి కల్లా టాకీ పార్ట్ పూర్తి చెయ్యాలని యూనిట్ టార్గెట్ పెట్టుకుంది. మే లో రిలీజ్ కాబోతున్న సర్కారు వారి పాట బిజినెస్ పై మేకర్స్ ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగానే సర్కారు వారి పాట డిజిటల్ హక్కులని అమ్మేసినట్లుగా తెలుస్తుంది.

అమెజాన్ ప్రైమ్ ఓటిటి సంస్థ సర్కారు వారి పాట డిజిటల్ హక్కులని సొంతం చేసుకుంది అని, అది కూడా భారీ డీల్ తో దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే డీల్ పూర్తయ్యి అగ్రిమెంట్ కూడా జరిగింది అని.. ఆ అగ్రిమెంట్ ప్రకారం.. సర్కారు వారి పాట రిలీజ్ అయిన 30 రోజుల్లో ఓటిటిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఒప్పందం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. అంటే మే లో సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయితే.. జూన్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంది. సర్కారు వారి పాట నుండి ఫిబ్రవరి 14 న ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈసినిమాలో కీర్తి సురేష్ మహేష్ తో మొదటిసారి జోడి కడుతుంది.

Interesting News on Sarkaru Vaari Paata Movie:

Sarkaru Vaari Paata Digital Rights OTT Release Date Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ