అగ్ర దర్శకుడు రాజమౌళి ట్రిపిల్ ఆర్ తరువాత తన తదుపరి సినిమా మహేష్ బాబు తో చేయనున్నాడు. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే మహేష్ బాబు తో సినిమా అయ్యాక, రాజమౌళి అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. పుష్ప సినిమా విడుదల అయ్యాక, రాజమౌళి అల్లు అర్జున్ కి ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారని, అల్లు అర్జున్ నటనని ఎంతో ప్రశంసించారని సమాచారం. దర్శకుడు సుకుమార్ ని అయితే ప్రశంశలతో ముంచెత్తినట్టుగా.. అదే సంభాషణలో రాజమౌళి, అల్లు అర్జున్ కలిసి పని చేస్తే ఎలా ఉంటుంది అన్న టాపిక్ కూడా వచ్చిందని, రాజమౌళి దానికి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని తెలుస్తుంది.
అయితే రాజమౌళి మహేష్ బాబు తో చేసిన తరువాత కచ్చితంగా అల్లు అర్జున్ తో సినిమా చేస్తా అని చెప్పారని.. రాజమౌళి తెలుగు లో టాప్ యాక్టర్స్ అయిన ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్ఠీఆర్, రవి తేజ తో పని చేసారు. ఇప్పుడు మహేష్ బాబు తో చేస్తారు. నెక్స్ట్ ఇంక అల్లు అర్జున్ మాత్రమే వున్నారు. అందుకని అతనితో కూడా ఒక సినిమా చెయ్యాలని అనుకున్నట్టు చెబుతున్నారు. అయితే అది కార్యరూపం దాల్చడానికి ఇంకా టైం వుంది అని, మహేష్ బాబు తో సినిమా చేస్తున్నప్పుడు ఈ అల్లు అర్జున్ సినిమా అనౌన్స్ చేయొచ్చని.. వీలయితే అల్లు అర్జున్ తనతో చెయ్యబోయే సినిమాని తనే ప్రొడ్యూస్ చేస్తా అని కూడా చెప్పాడని టాక్.