Advertisementt

రెండు సినిమాలు ఒకేసారి అంటున్న విజయ్

Tue 01st Feb 2022 08:30 PM
vijay deverakonda,dil raju,shiva nirvana,puri jagannadh,janaganamana movie  రెండు సినిమాలు ఒకేసారి అంటున్న విజయ్
Vijay says two movies at once రెండు సినిమాలు ఒకేసారి అంటున్న విజయ్
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్ దర్శకత్వం లో వస్తున్న లైగర్ షూటింగ్ లో బిజీ గా వున్నాడు. ఈ సినిమా అయ్యాక విజయ్ కొంచెం జోరు పెంచుదామని అనుకుంటున్నారు. అందుకే రెండు సినిమాలు ఒకేసారి మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాడు. తన తదుపరి సినిమా కూడా పూరి జగన్ దర్శకత్వం లో జనగణమన చెయ్యాలని అనుకుంటున్నాడు. అయితే ఇది కొంచెం మిలిటరీ నేపధ్యం వున్న సినిమా. అలాగే ఎప్పుడో దిల్ రాజు బ్యానర్ లో కమిట్ అయిన శివ నిర్వాణ దర్శకత్వం లో కూడా ఒక సినిమా ఇదే టైం లో స్టార్ట్ చెయ్యాలను అనుకుంటున్నాడు. 

ఎందుకంటే శివ నిర్వాణ కథ నేపధ్యం కూడా మిలిటరీ అవటం వల్ల, విజయ్ ఈ రెండు సినిమాలకి పెద్దగా లుక్ లో తేడా ఉండదు కాబట్టి, రెండూ ఒకేసారి షూటింగ్ చేసేద్దామని అనుకుంటున్నాడు. సుకుమార్ తో కూడా సినిమా వుంది కానీ, సుకుమార్ పుష్ప సెకండ్ పార్ట్ చేసి రావాలి. ఈలోపు విజయ్ ఈ రెండు సినిమాలు చేసేద్దామని అనుకుంటున్నారు. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే చేద్దామని చూస్తున్నాడు విజయ్. అందుకే కథా నాయికలను హిందీ రంగానికి సంబదించిన జాహ్నవి కపూర్, అలియా భట్, కియారా అద్వానీ లాంటి వాళ్ళను సంప్రదిస్తున్నారు.

Vijay says two movies at once:

Vijay Deverakonda next movie updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ