ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల మూవీ మొదలు పెట్టెయ్యడానికి రెడీగా ఉన్నాడు. ఫిబ్రవరి 7 న ఎన్టీఆర్ - కొరటాల కాంబో NTR30 పూజా కార్యక్రమాలతో మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో మరో మూవీకి కమిట్ అయ్యాడు. NTR30 అవ్వగానే ప్రశాంత్ నీల్ తో NTR31 చేస్తాడు. ఆతర్వాత కూడా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీస్ వారికీ సినిమా చెయ్యడానికి ఎన్టీఆర్ ఒప్పుకున్నాడని సమాచారం. బుచ్చిబాబు ఎన్టీఆర్ కి ఓ స్టోరీ వినిపించగా.. దానికి మార్పులు చెప్పిన ఎన్టీఆర్ మరో స్క్రిప్ట్ రెడీ చెయ్యమన్నాడని ప్రస్తుతం బుచ్చిబాబు ఆ పనిలో ఉన్నాడట.
అయితే బుచ్చిబాబు సినిమాలో ఎన్టీఆర్ కబడ్డీ ప్లేయర్ గా కనిపిస్తాడని, నేషనల్ వైడ్ గా ఎన్టీఆర్ కబడ్డీ ఆటలో సత్తా చాటుతాడని.. ఇలా ఏవేవో కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే.. కాదు బుచ్చిబాబు ఎన్టీఆర్ కాంబో కథ కోడిపందేల చుట్టూ తిరుగుతుంది అని, సంక్రాంతి పండగ టైం లో భీమవరం అటు సైడ్ నిర్వహించే కోడి పందేల ఆధారంగా తెరకెక్కుతుంది అంటున్నారు. దానితో ఎన్టీఆర్ ఫాన్స్ అదేమిటి కబడ్డీ అన్నారు, ఇప్పుడు కోడి పందేలు అంటున్నారు.. అసలు ఎన్టీఆర్ - బుచ్చిబాబు కాంబోకి ఈ కన్ఫ్యూజన్ ఏమిట్రా బాబు అంటున్నారు.