Advertisementt

పూరి అండ్ విజయ్ బ్రేక్స్ లేని బండిలా

Tue 01st Feb 2022 11:36 AM
vijay devarakonda,puri jagannadh,dream project,janaganamana project  పూరి అండ్ విజయ్ బ్రేక్స్ లేని బండిలా
Vijay Deverakonda to Play Lead in Puri Jagannadh Dream project పూరి అండ్ విజయ్ బ్రేక్స్ లేని బండిలా
Advertisement
Ads by CJ

పూరి జగన్నాధ్ - విజయ్ దేవరకొండ లు ప్రస్తుతం లైగర్ షూటింగ్ మోడీ లో ఉన్నారు. ఆగష్టు 25 న లైగర్ ని రిలీజ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేసారు. అయితే విజయ్ లైగర్ తర్వాత పూరి తో మరో సినిమా చెయ్యడానికి కమిట్ అయినట్లుగా ఈమధ్యన సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. పూరి జగన్నాధ్ డ్రీం ప్రాజెక్ట్ జనగణమన ని అసలైతే ముందు మహేష్ బాబు తో చెయ్యాలని అనుకున్నాడు. కానీ మహేష్ నో చెప్పేసరికి.. ఆ జనగణమన స్క్రిప్ట్ బాలీవుడ్ హీరోల చెంతకు చేరింది అన్నారు. కానీ ఇప్పుడు అదే ప్రాజెక్ట్ ని పూరి విజయ్ దేవరకొండ తో చేయబోతున్నాడట.

అది కూడా లైగర్ మూవీ రిలీజ్ అయ్యేలోపే ఈ జనగణమన ప్రాజెక్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యేలా విజయ్ - పూరి లు చూస్తున్నారట. ఈ ఫిబ్రవరి ఎండింగ్ లో ఆ ప్రాజెక్ట్ ని అమెరికా లో మొదలు పెట్టే యోచనలో పూరి - విజయ్ లు ఉన్నారని, లైగర్ సినిమా రిలీజ్ లోపే షూటింగ్ కంప్లీట్ చేసేయాలని కంకణం కట్టుకున్నారట. మరి పూరి జగన్నాధ్ దర్శకత్వం స్పీడు తెలియంది కాదు. అలా జెట్ స్పీడు లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది మొదట్లోనే ఈ సినిమాని రిలీజ్ కి రంగం సిద్ధం చెయ్యాలని చూస్తున్నారట.

ఈ సినిమాతోనే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని సౌత్ లో లాంచ్ చెయ్యడానికి పూరి జగన్నాధ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Vijay Deverakonda to Play Lead in Puri Jagannadh Dream project:

Vijay Devarakonda Accepts Puri Jagannadh Dream Project

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ