మెగా ఫ్యామిలోని మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ మరోసారి తన భర్త నుండి విడిపోవడానికి రెడీ అయ్యింది అనే న్యూస్ చాన్నాళ్లుగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. గతంలో ఓ కూతురుతో శిరీష్ భరద్వాజ్ నుండి విడాకులు తీసుకుని ఫ్యామిలీ సపోర్ట్ తో చిరు ఫ్రెండ్ కొడుకు కళ్యాణ్ దేవ్ ని రెండో వివాహమాడిన శ్రీజ మరో కూతురికి జన్మనిచ్చింది. అలాంటి శ్రీజ మళ్ళీ కళ్యాణ్ దేవ్ తో విడిపోవడానికి సిద్ధపడింది అంటున్నారు. వారి మధ్యన తలెత్తిన విభేదాలను మెగాస్టార్ కూడా చక్కబెట్టలేక చేతులెత్తెయ్యడంతో.. వారి విడాకులు అనివార్యమనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. కానీ ఈ విడాకుల విషయమై మెగా కాంపౌండ్ మాత్రం మౌనంగానే ఉంది.
ఇక శ్రీజ రెండు రోజుల క్రితం అన్న రామ్ చరణ్ ఆయన పెట్ రైమా తో కలిసి ముంబై వెళ్ళింది. అక్కడ చరణ్, శ్రీజలు ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. అయితే శ్రీజ విడాకులు తీసుకున్న బాధలో ఉంది, అందుకే రామ్ చరణ్ అలా ముంబై తీసుకెళ్లాడని, అక్కడ కొత్త వాతావరణంలో శ్రీజ ఆ బాధని మర్చిపోయేలా చెయ్యడానికి చరణ్ అలా చేసాడని అంటుంటే.. శ్రీజ సోషల్ మీడియాలో అన్న చరణ్ తో దిగిన ఫొటోస్ ని షేర్ చేస్తూ.. హగ్స్ అండ్ హగ్స్.. నేను బ్రతకడానికి సంతోషాన్నిచ్చే చిన్న చిన్న విషయాలివే అంటూ పోస్ట్ చెయ్యడంతో.. శ్రీజ కి కళ్యాణ్ కి విడాకులయ్యాయి అని, అందుకే శ్రీజ ఇలాంటి పోస్ట్ లు పెడుతుంది అంటూ నెటిజెన్స్ అభిప్రాయం పడుతున్నారు.