రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకులు ఎదురు చూసారు. జనవరి 7 న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అనగానే పండగ చేసుకున్నారు. అదే స్థాయిలో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ని రాజమౌళి ఊపేసారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు సినిమాపై మరింత అంచనాలు, ఉత్సాహాన్ని పెంచేశారు. కానీ కరోనా మహమ్మారి దెబ్బకి వాయిదా పడడంతో ఫాన్స్ ఉసూరుమన్నారు. తర్వాత తాయితీగా రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ని అన్ని అనుకూలిస్తే మార్చ్ 18 న, కాదు పరిస్థితులు అలాగే ఉన్నాయంటే ఏప్రిల్ 28 న రిలీజ్ చేస్తామని అన్నారు.
కానీ తాజాగా ఆర్.ఆర్.ఆర్ కి పక్కా డేట్ ప్రకటించారు. మార్చి 25 న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అంటూ కొత్త డేట్ ని ప్రకటించారు. హమ్మయ్య ఏప్రిల్ 28 వరకు వెయిట్ చెయ్యక్కర్లేదు అని ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫాన్స్ ఖుషి ఫీలవుతున్నారు. రెండు డేట్స్ ఇచ్చారు.. ఏ డేట్ కి వస్తారో పక్కాగా తెలియక మిగతా సినిమాల నిర్మాతలు కన్ఫ్యూజ్ అవుతున్న టైం లో రాజమౌళి పక్కా డేట్ ఇచ్చేస్తూ ఆర్.ఆర్.ఆర్ ని మార్చ్ 25 న రిలీజ్ చెయ్యబోతున్నారు. సో మార్చ్ ఫస్ట్ నుండి ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారన్నమాట.
ఇక అటు ఆచార్య టీం నుండి కూడా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. మెగాస్టార్ - కొరటాల కాంబోలో తెరకెక్కిన ఆచార్య అసలైతే ఫిబ్రవరి 4 న రిలీజ్ అవ్వాల్సి ఉండగా.. ప్రస్తుత పరిస్థితుల దృశ్య ఏప్రిల్ 1 కి పోస్ట్ చేసారు. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ రాక మార్చ్ 25 కి ఫిక్స్ అవడంతో.. ఏప్రిల్ 1 కి విడుదల కావాల్సిన ఆచార్య ఏప్రిల్ 29 కి షిఫ్ట్ అయ్యింది. సో ఆచార్య అఫీషియల్ గా ఏప్రిల్ 29 న రాబోతుంది అన్నమాట.