కరోనా కాటు - ఆంధ్రాలో టికెట్ రేటు రెండూ కలిసి కాళ్ళు అడ్డు పెట్టడంతో తెలుగు సినిమా తూలిపడిందని చెప్పాలి. ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్లు మార్చుకుంటూ వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రాలు చివరికి సంక్రాంతి సీజన్ ని కూడా కోల్పోయాయి. అయితే ఫిబ్రవరి నెలాఖరుకి పరిస్థితులు చక్కబడతాయనీ... ఆ వెంటనే వెయిటింగ్ లో ఉన్న సినిమాలన్నీ థియేటర్స్ కి క్యూ కడతాయనీ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. పెద్ద సినిమాల పక్కా రిలీజ్ డేట్స్ అంటూ ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ లో స్ప్రెడ్ అవుతోన్న తేదీల వివరాలు ఎలా ఉన్నాయంటే....
భీమ్లా నాయక్ - ఫిబ్రవరి 25/ ఏప్రిల్ 1
రాధే శ్యామ్ - మార్చ్ 11
ఆర్.ఆర్.ఆర్ - మార్చ్ 25
KGF 2 - ఏప్రిల్ 14
F 3 - ఏప్రిల్ 28
ఆచార్య - ఏప్రిల్ 29
సర్కారు వారి పాట - మే 12