టఫ్ సిట్యుయేషన్ లో రిలీజ్ కి వచ్చాడు. టాక్ కాస్త నెగెటివ్ గా వున్నా తట్టుకున్నాడు. తన పెరఫార్మెన్స్ పవర్ ఏంటనేది చూపించాడు. తన స్టార్ డమ్ రేంజ్ ఎంతనేది ప్రూవ్ చేసాడు. మొత్తానికి పుష్పగా అల్లు అర్జున్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ ఐకాన్ స్టార్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చేసిన సక్సెస్ ఇది. ఎంతోమంది సెలెబ్రిటీస్ నే బన్నీకి ఫ్యాన్సుని చేసేసిన రిజల్ట్ ఇది. మిగిలిన అన్ని భాషల్లోనూ హ్యాపీ ప్రాజెక్ట్ అయిన పుష్ప హిందీలో మాత్రం అనూహ్యమైన, అద్వితీయమైన విజయాన్ని సాధించిందని చెప్పాలి. పుష్పగా బన్నీ యాక్టింగ్ కి నార్త్ ఆడియన్స్ ఎంతగా రియాక్ట్ అయ్యారంటే అక్కడ ఆ చిత్రానికి వంద కోట్ల కలెక్షన్ ఇచ్చేంత.! ఎస్.. హిందీలో వంద కోట్ల నెట్ కలెక్షన్ మార్కుని నిన్ననే రీచ్ అయింది పుష్ప. రజనీకాంత్, ప్రభాస్ ల తర్వాత నార్త్ లో ఈ ఫీట్ సాధించిన మూడో సౌత్ హీరో అయ్యాడు అల్లు అర్జున్.
రాబోయే రాధే శ్యామ్, ఆర్.ఆర్.ఆర్. చిత్రాలకు కూడా హిందీలో వంద కోట్లు సాధించగల సత్తా ఉన్నప్పటికీ పుష్ప పార్ట్ 2 తో మళ్ళీ తన ప్రతాపం చూపనున్నాడు బన్నీ. ఇప్పటికే పుష్ప ది రూల్ హిందీ రైట్స్ కోసం దాదాపు 300 కోట్ల ఆఫర్ ఉందనేది ట్రేడ్ టాక్. ఇపుడే ఇలా ఉంటే రిలీజ్ టైమ్ కి ఆ రేట్స్ ఏ రేంజ్ కి వెళతాయో.. సినిమాపై ఎంతటి హైప్ ఉంటుందో ఊహించొచ్చు. ఏదేమైనా బాలీవుడ్ కోటపై మన తెలుగు సినిమా పతాకాన్ని మరోమారు ఎగురవేసినందుకు వెల్ డన్ బన్నీ.. నీవే రాబోయే రోజులు అన్నీ అనాల్సిందే..!