అతడు, ఖలేజా తర్వాత మహేష్ - త్రివిక్రమ్ ల జోడీ మరోసారి జతకట్టనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సబ్జెక్టు లాక్ చేసుకుని స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి ౩ న పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారు. తన పర్సనల్ సెంటిమెంట్ మేరకు ఈ పోగ్రామ్ కి మహేష్ అటెండ్ అవ్వరు కానీ ఆయన సతీమణి నమ్రత, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ, హీరోయిన్ పూజ హెగ్డే, సంగీత దర్శకుడు థమన్ తదితరులు ఈ ఓపెనింగ్ సెర్మనీకి హాజరవుతారని తెలుస్తోంది.
కాగా మహేష్ ప్రస్తుతం చేస్తోన్న సర్కారు వారి పాట తాజా షెడ్యూల్ నేటి నుంచీ హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. ఆల్రెడీ కోవిడ్ నుంచి కోలుకుని రెస్ట్ తీసుకుంటున్న మహేష్ ఫిబ్రవరి 14 నుంచీ సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొంటారు.