సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ ని ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ పక్కనపెట్టేసింది. అయినా రకుల్ ప్రీత్ కి బాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచింది. అక్కడ రకుల్ ప్రీత్ కి చేతినిండా సినిమాలే కాదు, అక్కడ బాలీవుడ్ హీరో జాకీ భగ్నానీ తో ప్రేమలో మునిగి తేలుతుంది. బాలీవుడ్ బడా సినిమాలతో బిజీగా వున్నా రకుల్ ఫిట్ నెస్ విషయంలో అస్సలు అశ్రద్ధ చెయ్యదు. వీకెండ్స్ అయినా, వీక్ డేస్ అయినా.. జిమ్ లో తెగ కష్టపడుతుంది. కేవలం వర్కౌట్స్ మాత్రమే కాదు.. అనుష్క యోగా అంటూ రకరకాల భంగిమలతో యోగాసనాలు వేస్తుంది.
చీరలు కట్టి డిఫ్రెంట్ డిఫ్రెంట్ భంగిమలతో యోగా ట్రై చేస్తుంది. తాజాగా అయితే తల కింద పెట్టి, కాళ్ళు పైకి పెట్టి చేసిన యోగాసనం పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది రకుల్. రకుల్ ప్రీత్ యోగా పిక్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. When life turns upside down simply adjust your view 😜 #yogathoughts 🧘♀️అంటూ రకుల్ ఆ పిక్ ని షేర్ చేసింది. రకుల్ ని నిజంగా ఆ పిక్ లో చూస్తే సైజు జీరో కోసం ట్రై చేస్తుంది అంటూ కామెంట్స్ చేసిన వారే ఇప్పుడు రకుల్ ప్రీత్ ఫిట్ నెస్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నారు.