Advertisementt

ముంబై కి మకాం మార్చిన దగ్గుబాటి హీరోలు

Sun 30th Jan 2022 06:33 PM
venkatesh,rana daggubati,miheeka,mumbai airport  ముంబై కి మకాం మార్చిన దగ్గుబాటి హీరోలు
Daggubati Heroes at Mumbai Airport ముంబై కి మకాం మార్చిన దగ్గుబాటి హీరోలు
Advertisement
Ads by CJ

దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలైన వెంకటేష్ రీసెంట్ గానే ఆయన నటిస్తున్న ఎఫ్ 3 షూటింగ్ కంప్లీట్ చేసారు. ఇక రానా దగ్గుబాటి కూడా ఆయన నటించిన విరాట పర్వం మరికొన్ని షూటింగ్స్ కంప్లీట్ చేసారు. సంక్రాంతి పండగని కలిసి అందంగా జరుపుకున్న దగ్గుబాటి హీరోలు ఇప్పుడు హైదరాబాద్ నుండి ముంబై కి మకాం మార్చారు. రానా అయితే వైఫ్ మెహిక తో పాటుగా.. ముంబై వెళ్లగా వెంకటేష్ మాత్రం సింగిల్ గా వెళ్లారు. అయితే ఇలా దగ్గుబాటి హీరోలు ఉన్నట్టుండి  ఒక్కసారిగా ముంబై వెళ్ళడానికి కారణం వేరే ఏం లేదట. వాళ్లిద్దరూ కలిసి నటిస్తున్న రానా - నాయుడు వెబ్ సీరీస్ కోసమే వీరు ముంబై ఫ్లైట్ ఎక్కినట్లుగా తెలుస్తుంది. 

నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో రాబోయే రానా నాయుడు వెబ్ సీరీస్ లో వెంకటేష్ - రానా లు నటిస్తున్నారు. రీసెంట్ గా బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో లో ఏంటి వెంకటేష్ గారు బూతులు మాట్లాడుతున్నారట ఓటిటి షో కోసం అని బాలయ్య రానా ని అడగగా.. అవును వెంకటేష్ గారు తెలుగులో బూతులు మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటే ఆయనతో హిందీ బూతులు మట్లాడిస్తున్నారు అని రానా చెప్పగానే. టాలీవుడ్ ఇండస్ట్రీకి స్వామి వివేకానందుడు మీ వెంకటేష్ కానీ నువ్వు బట్టలు విప్పి కూర్చీబెట్టావ్ అనగానే ఆయన అమెరికాలో ఉన్నారు ప్రస్తుతం ఈ షో చూడకుండా చూసుకుంటాను అన్నాడు. సో ఇప్పుడు రానా - నాయుడు షూటింగ్ కోసమే వెంకటేష్ - రానాలు ముంబై వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కాకపోతే రానాకీ ఈమధ్యనే పెళ్లయింది కాబట్టి తన భార్య మెహికాని వెంట తీసుకుని వెళ్ళాడంటున్నారు.

Daggubati Heroes at Mumbai Airport:

Venkatesh, Rana Daggubati with Miheeka spotted at Mumbai Airport

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ