Advertisementt

యశ్ కన్నా దారుణంగా ఉన్న ప్రభాస్

Sun 30th Jan 2022 05:31 PM
prabhas,salaar,yash,kgf,prashanth neel,prabhas salaar  యశ్ కన్నా దారుణంగా ఉన్న ప్రభాస్
Salaar leaked pics goes viral యశ్ కన్నా దారుణంగా ఉన్న ప్రభాస్
Advertisement
Ads by CJ

ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ మూవీ కొత్త షెడ్యూల్ చిత్రీకరణ అతి త్వరలోనే హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో మొదలు కాబోతుంది. ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ రిలీజ్ టెంక్షన్ లో ఉన్నారు. కొత్త డేట్ ఇచ్చాక కొద్దిపాటి ప్రమోషన్స్ తో రాధేశ్యామ్ విడుదలయ్యాక సలార్ షూట్ చేద్దామనుకున్న ప్రభాస్.. ఫిబ్రవరి నుండి సలార్ షూటింగ్ లోకి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. రామోజీ ఫిలిం సిటీలో సలార్ రెండో షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ తర్వాత ఆ షూటింగ్ నిరవధికంగా వాయిదా పడింది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో ఇప్పుడు మరో షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారట.

ఆ షెడ్యూల్ 20 నుంచి 30 రోజుల పాటు ఉండబోతుందట. ఈ షెడ్యూల్ లో ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా ప్రభాస్, శృతి హాసన్ సినిమాలోని మెయిన్ కేరెక్టర్స్ చిత్రీకరణ కోసం సిద్దమవుతున్నారట. అయితే ఇలాంటి టైం లో ప్రభాస్ సలార్ పిక్ ఒకటి లీక్ అయ్యింది. గతంలోనూ సలార్ సెట్స్ నుండి కొన్ని పిక్స్ లీకై ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు సలార్ సెట్ నుండి లీకైన ప్రభాస్ పిక్ చూస్తే కన్నడ స్టార్ హీరో యశ్.. కెజిఎఫ్ లో ఎంత రఫ్ గా మాస్ గా కనిపించాడో అంతకు మించి అన్నట్టుగా ప్రభాస్ సలార్ మాస్ లుక్ ఉంది. ప్రభాస్ వైలెంట్ లుక్‌తో భయపెట్టేలా కనిపించడమే కాదు ఈ ఆరడుగుల కటౌట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. సెట్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఇంటర్నెట్, సోషల్ మీడియా విపరీతంగా ప్రాచుర్యం పొందాక ఇలాంటి లీకులని ఆపలేక చేతులెత్తేస్తున్నారు దర్శకనిర్మాతలు.

Salaar leaked pics goes viral:

Prabhas Salaar leaked pics goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ