Advertisementt

హరిహర వీరమల్లు పై ఆర్ట్ డైరెక్టర్ కామెంట్స్

Sun 30th Jan 2022 01:19 PM
anand sai,art director,hari hara veeramallu,krish,pawan kalyan  హరిహర వీరమల్లు పై ఆర్ట్ డైరెక్టర్ కామెంట్స్
Anand Sai raves about Hari Hara Veeramallu హరిహర వీరమల్లు పై ఆర్ట్ డైరెక్టర్ కామెంట్స్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న హరి హర వీర మల్లు మూవీ కొత్త షెడ్యూల్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ఏడాది సెకండ్ వేవ్ కి ముందు ఆగిన హరి హర వీరమల్లు మూవీ షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుంది. ఈ సినిమా కోసం భారీ సెట్స్ నిర్మాణంలో ఉన్నాయి. గోల్కొండ కోట, చార్మినార్ సెట్, ఇంకా చాలా రకాల సెట్స్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. హరి హర వీరమల్లు పిరియాడికల్ డ్రామా. కాబట్టి ఎక్కువగా సెట్స్ అవసరమవడంతో నిర్మాతలు భారీ బడ్జెట్ తో ఈ సెట్స్ నిర్మాణాన్ని చేపట్టారు. 

తాజాగా ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఆనంద్ సాయి ఈ సినిమా సెట్స్ గురించి మాట్లాడుతూ.. హరి హర వీర మల్లు సినిమాలో కళాత్మకమైన సెట్ వర్క్స్‌పై అద్భుతంగా ఉంటాయని, అంతేకాకుండా అందమైన కథాంశంతో రూపొందిస్తున్న హరి హర వీరమల్లులో సెట్‌ వర్క్స్‌లోనే సౌందర్యాన్ని జోడిస్తున్నట్లు చెప్పారు. సెట్స్ లోనే అనేక రకాల అంశాలు హైలెట్ అవుతాయట. దాని కోసమే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా ఆనంద్ చెప్పారు. ఇంకా ఈ సినిమాలో 16వ శతాబ్దం మధ్యకాలంలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లులో కనిపిస్తారని టాక్. పవన్ కళ్యాణ్ వర్ ఫుల్ వారియర్ గానే కాకుండా ఒక గజ దొంగగా కూడా మహారాజులను ముప్పు తిప్పలు పెట్టే పాత్రలో కనిపిస్తారని, ఆయనకి కథ నాయికగా నిధి అగర్వాల్ నటిస్తుంది. మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్ భామ నోరా ఫెతి నటిస్తుంది.

Anand Sai raves about Hari Hara Veeramallu:

Anand Sai raves about Pawan Kalyan motivation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ