ప్రభాస్ యూరప్ ట్రిప్ ముగించుకుని హైదరాబాద్ వచ్చేసాడు. రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ఇచ్చినా.. కొద్దిపాటి ప్రమోషన్స్ తో మూవీ ని థియేటర్స్ లోకి తెచ్చే యోచనలో ప్రభాస్ టీం ఉంది. అలాగే ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసేసారు. తదుపరి ప్రాజెక్ట్ కే, సలార్ షూట్స్ ని పారలల్ గా చెయ్యబోతున్నారు ప్రభాస్. సలార్ ఇప్పటికే రెండు, మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా.. తాజాగా కొత్త షెడ్యూల్ మొదలు పెట్టాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఆద్య గా శృతి హాసన్ ప్రభాస్ తో రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయెల్ పోషిస్తున్నారని సినిమా మొదలైనప్పటినుండి ప్రచారం జరుగుతుంది.
అయితే ఇప్పుడు సలార్ కూడా ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ మాదిరి రెండు భాగాలుగా తెరకెక్కుతుంది అని, ఒక భాగంలోనే కథ చెప్పడానికి అవ్వదని, సో అలా సలార్ ని ప్రశాంత్ నీల్ రెండు భాగాలు చేయబోతున్నాడని అంటున్నారు. ఇప్పటికే మూడున్నర గంటల ఫుటేజ్ ని షూట్ చేసాడని, అందులో ఎక్కువగా కట్స్ లేకుండా మిగతా షూటింగ్ కలిపితే రెండు భాగాలుగా సలార్ ని రిలీజ్ చెయ్యొచ్చని, ప్రభాస్ మార్కెట్ పరంగా రెండు భాగాల సలార్ ఖచ్చితంగా వర్కౌట్ అవ్వుద్ది అని మేకర్స్ కూడా భావిస్తున్నారట. మరి సలార్ రెండు భాగాలంటే.. ఒకటి ఈ ఏడాది, మరొకటి వచ్చే ఏడాది రిలీజ్ చెయ్యాల్సి ఉంటుంది. అలా అయితే ఇప్పుడు ప్రభాస్ చేతిలో బోలెడన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నట్లే. రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్, ఇప్పడు సలార్ 2 అన్నమాట.