కోవిడ్ కారణంగా, వీకెండ్ లాక్ డౌన్స్, నైట్ కర్ఫ్యుల కారణంగా వాయిదా పడుతున్న తమిళ సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్స్ ప్రకటించుకుంటున్నాయి. తాజాగా సరికొత్త కథలను తెరపైకి తీసుకొస్తూ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుంటారు కోలీవుడ్ స్టార్ విశాల్. ఈ క్రమంలోనే ఆయన కొత్త సినిమా సామాన్యుడు ఓ యూనిక్ కంటెంట్ తో తెరకెక్కింది. డెబ్యూ డైరెక్టర్ తు ప శరవణన్ రూపొందించిన ఈ యాక్షన్ డ్రామా సంక్రాంతికి ఒకసారి, రిపబ్లిక్ డే కి విడుదల అన్నా.. అప్పుడు వాయిదా పడింది. ఇక తాజాగా ఫిబ్రవరి 4 న ప్రపంచ వ్యాప్తం గా థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఈ సినిమాను విశాల్ నిర్మించారు.
ఇటీవల విడుదల చేసిన టీజర్ ,ట్రైలర్ చూస్తే..ఫుల్ యాక్షన్ మోడ్లో సామాన్యుడు సినిమా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. అలాగే సెకండ్ సాంగ్ మత్తెక్కించేకు కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. విశాల్ సరసన డింపుల్ హయతి నాయికగా నటించారు. కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ, యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సామాన్యుడు సినిమాను టెక్నికల్ గా స్ట్రాంగ్ గా మార్చేశాయి.