Advertisementt

ఆహా.. బాలయ్య స్టయిల్ వెనుక ఆమె..

Sat 29th Jan 2022 06:14 PM
machha ravi,balakrishna,unstoppable,aha talk show,aha ott,machha ravi latest interview about aha ott,balayya daighter tejaswini  ఆహా.. బాలయ్య స్టయిల్ వెనుక ఆమె..
Machha Ravi Latest Interview ఆహా.. బాలయ్య స్టయిల్ వెనుక ఆమె..
Advertisement
Ads by CJ

నందమూరి నట సింహం బాలకృష్ణ అల్లు వారి కాంపౌండ్ లో అడుగుపెట్టడం అంటే మాములు విషయం కాదు. అలాంటి ఆహా టాక్ షో అన్ స్టాపబుల్ అంటూ ఆహా ఓటిటికి అద్భుతమైన విజయాన్ని అందించారు బాలయ్య. బన్నీ నుండి మహేష్ వరకు స్టార్ హీరోలతో అన్ స్టాపబుల్ అనిపించిన బాలకృష్ణ తన స్టయిల్ తో మరింత హైలెట్ అయ్యారు. డ్రెస్సెస్ కానివ్వండి, హెయిర్ స్టయిల్ కానివ్వండి.. ఇలా బాలయ్య ఆహా టాక్ షో స్టయిల్ అందరికి నచ్చేసింది. అయితే తాజాగా ఆహా బాలయ్య స్టయిల్ వెనుక ఎంతోమంది శ్రమ ఉంది అందులో మెయిన్ గా ఆయన చిన్న కూతురు తేజస్విని శ్రమ ఉంది అంటూ మచ్చ రవి ఓ ఛానల్ ఇంటర్వ్యూ లో చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

ఆహా కోసం మచ్చ రవి బాలకృష్ణ గారికి స్క్రిప్ట్ అందించేవారట.

ఇక ఆహా కోసం చాలామంది శ్రమించారు.. అసలు బాలకృష్ణ గారు ఈ షో ఒప్పుకోవడానికి అరవింద్ గారు ఏం చేసుంటారా అనే అనుమానంతో ఆయన్ని అడగగా.. నేను వెళ్లి ఆహా కోసం టాక్ షో చెయ్యాలి అనగానే బాలకృష్ణ ఒప్పేసుకున్నారు అన్నారు అరవింద్ గారు అంటూ వారిమధ్యన జరిగిన సీక్రెట్ ని బయట పెట్టాడు మచ్చ రవి. బాలకృష్ణ గారు కొత్తదనం కోరుకుంటారు అందుకే ఈ టాక్ షో కి ఆయన ఓకె చెప్పారు అన్నాడు రవి. ఇంకా ఆయన స్టయిల్ వెనుక ఆయన చిన్న కూతురు తేజస్విని ఉంది అని, ఆ క్రెడిట్ ఆమెకి ఇవ్వడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాడు. తేజస్విని చాలా కమాండబుల్ జాబ్ చేసారని.. డిజైన్ ఇలా ఉండాలని మేము చెప్పినా.. ఎండ్ ప్రొడెక్టు పర్ఫెక్ట్ గా రావడంలో వాళ్ళ కష్టం కనిపిస్తుంది అని చెప్పాడు రవి. సో ఆహా బాలయ్య స్టయిల్ వెనుక బాలయ్య చిన్న కూతురు తేజస్విని శ్రమ దాగుందన్నమాట.

Machha Ravi Latest Interview :

Machha Ravi Latest Interview about Aha OTT

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ