ప్రస్తుతం టాలీవుడ్ లో కమర్షిల్ హిట్స్ కొట్టిన దర్శకులకి కార్లని గిఫ్ట్ గా ఇవ్వడం అనేది ఓ కొత్త ట్రెండ్ లా మారింది. గతంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కి మహేష్ బాబు కారు గిఫ్ట్ గా ఇచ్చారు. అలాగే ఛలో తో హిట్ కొట్టిన వెంకీ కుడుములకి నాగ శౌర్య కారు గిఫ్ట్ ఇచ్చాడు. దర్శకుడు మారుతీ కి గీత ఆర్ట్స్ నుండి కొత్త కారు గిఫ్ట్ గా వచ్చింది. అలాగే ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు కి ఉప్పెన బ్లాక్ బస్టర్ అవడంతో మైత్రి వారు కారు గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఇవన్నీ సినిమాలు రిలీజ్ తర్వాత సూపర్ హిట్ కొట్టాక ఇచ్చిన గిఫ్ట్స్.
కానీ ఇప్పుడు ఖిలాడీ దర్శకుడు రమేష్ వర్మ ఖిలాడీ మూవీ ఇంకా రిలీజ్ కాకుండానే నిర్మాతల నుండి ఓ కారుని గిఫ్ట్ అందుకున్నారు. క్రాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ తో రాక్షసుడు మూవీ తో సూపర్ హిట్ కొట్టిన రమేష్ వర్మ - నిర్మాత సత్యనారాయణలు ఖిలాడీ మూవీ చేస్తున్నారు. ఖిలాడీ మూవీ ఫిబ్రవరి 11 న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఖిలాడీ పై మార్కెట్ లోను ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలున్నాయి. అయితే రిలీజ్ కి సిద్దమవుతున్న ఖిలాడీ ఫస్ట్ కాపీ చూసిన ప్రొడ్యూసర్ హ్యాపీగా ఫీల్ అయ్యి సినిమా రిలీజ్ కి ముందే రమేష్ వర్మకి రేంజ్ రోవర్ గిఫ్ట్ గా ఇచ్చారు. రమేష్ వర్మకి కొత్త కారు గిఫ్ట్ గా ఇచ్చిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.