ఈ రోజు జనవరి 29 మెగాస్టార్ చిరు అమ్మగారు అంజనా దేవి పుట్టిన రోజు. అమ్మ అంజనా దేవి పుట్టిన రోజుని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుని అమ్మ ఆశీస్సులు తీసుకుంటారు కొడుకులు మెగాస్టార్ చిరు, నాగబాబు, పవన్ కళ్యాణ్. కానీ ఈసారి తల్లి ఆశీస్సులు అందుకునే భాగ్యం తనకి లేదని, కారణం కరోనా వైరస్ బారిన పడి తాను హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను అని మెగాస్టార్ చిరు తన తల్లికి బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ గా ట్వీట్ చేసారు.
అమ్మా !
జన్మదిన శుభాకాంక్షలు
క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..
నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ
అభినందనలతో .... శంకరబాబు అంటూ తన భార్య సురేఖ, తల్లి అంజనాదేవితో పాటుగా తాను ఉన్న పిక్ ని షేర్ చేస్తూ తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.