Advertisementt

మా ప్రెసిడెంట్ గా నరేష్ సస్పెండ్ కావాల్సింది, కానీ..

Sat 29th Jan 2022 10:56 AM
naresh,formerly maa president naresh,maa president,manchu vishnu,megastar chiru  మా ప్రెసిడెంట్ గా నరేష్ సస్పెండ్ కావాల్సింది, కానీ..
Naresh should be suspended as MAA President, But ... మా ప్రెసిడెంట్ గా నరేష్ సస్పెండ్ కావాల్సింది, కానీ..
Advertisement
Ads by CJ

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ప్రెసిడెంట్ గా నరేష్ వున్నప్పుడు చాలాతప్పిదాలు చేసాడు అన్న సంగతి ఈమధ్య వెలుగులోకి వచ్చింది. నరేష్ ఎంతసేపూ అవతలి వాళ్ళ మీద బురద జల్లటమే తప్ప తాను చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చాడు. మా ప్రెసిడెంట్ గా వున్నప్పుడు డిస్సిప్లినరీ కమిటి నరేష్ చేస్తున్నవి తప్పు బట్టి అతన్ని వెంటనే ఆ పదవి నుండి తప్పించాలని కోరింది. అయితే అప్పట్లో చిరంజీవి గారు ఆ కమిటి కి అధ్యక్షులుగా వున్నారు. చిరంజీవి గారు నరేష్ ని సస్పెండ్ చేస్తే మళ్ళీ ఇంకా పెద్ద రాద్ధాంతం అవుతుంది అని ఊహించి, ఇప్పుడు వద్దు అని ఊరుకున్నారు. ఎందుకంటే అప్పటికే మా సంస్థ మీద రోజూ ఎదో ఒక వార్త రావటం అందువల్ల తెలుగు సినిమా కి చాలా నష్టం జరుగుతుంది అన్న ఒక కారణం తో కూడా చిరంజీవి గారు అలోచించి నరేష్ ని సస్పెండ్ చెయ్యలేదు. 

కానీ అప్పట్లో నరేష్ ని లీవ్ తీసుకోమని, బనెర్జీ ని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించిన సంగతి తెలిసిందే. కానీ మళ్ళీ నరేష్ కృష్ణం రాజు లాంటి పెద్దల కాళ్ళు పట్టుకొని వెనక్కి వచ్చాడు. అదే సమయంలోనే చిరంజీవి గారు మా డిస్సిప్లినరీ కమిటీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎందుకంటే నరేష్ ని సస్పెండ్ చెయ్యటం ఇష్టం లేక, మా లో జరుగుతున్న తప్పుడు పనులు చూస్తూ ఊరుకోలేక రాజీనామా చేసారు. ఆ తరువాత అదే నరేష్, మంచు విష్ణు ప్యానల్ కి సపోర్ట్ చేసి గెలిపించిన విషయం తెలిసిందే. అందుకే మెగా ఫామిలీ ప్రకాష్ రాజ్ ని సపోర్ట్ చెయ్యాల్సి వచ్చింది అని కూడా సమాచారం. ఈ విషయాలన్నీ ఈ మధ్య వెలుగులోకి వచ్చాయి.

Naresh should be suspended as MAA President, But ...:

 Formerly MAA President Naresh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ