Advertisementt

భీమ్లా నాయక్ పోస్ట్ పోన్ అంటున్నారు

Fri 28th Jan 2022 10:46 PM
bheemla nayak,pawan kalyan,rana,bheemla nayak postponed again,bheemla nakaya makers  భీమ్లా నాయక్ పోస్ట్ పోన్ అంటున్నారు
Bheemla Nayak Postponed again? భీమ్లా నాయక్ పోస్ట్ పోన్ అంటున్నారు
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఒకసారి పోస్ట్ పోన్ అయ్యింది. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సిన పవన్ భీమ్లా నాయక్ ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ తో జరిగిన మీటింగ్ తో కాస్త వెనక్కి తగ్గారు. దానితో భీమ్లా నాయక్ ని కూల్ గా ఫిబ్రవరి 25 కి షిఫ్ట్ చేసారు. నిన్నమొన్నటివరకు భీమ్లా నాయక్ ప్రమోషన్స్ తో సోషల్ మీడియాలో దుమ్మురేపారు. పాన్ ఇండియా మూవీస్ తో సమానమైన క్రేజ్ ఉన్న భీమ్లా నాయక్ రాక ఫిబ్రవరి 25 నే అంటూ అప్పుడప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చెబుతున్నారు. అయితే తాజా పరిస్థితులు దృష్యా మరోసారి భీమ్లా నాయక్ పోస్ట్ పోన్ అనివార్యమంటున్నారు విశ్లేషకులు.

కరోనా పరిస్థితుల వలన 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ, ఏపీలో నైట్ కర్ఫ్యూలు, ఏపీలో టికెట్ రేట్స్ ఇష్యు ఇంకా తెగకపోవడం వలన, ఇన్ని సమస్యల మధ్యన భీమ్లా నాయక్ ని రిలీజ్ చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకు అని భీమ్లా నాయక్ మేకర్స్ ఆలోచిస్తున్నారట. అందుకే శర్వానంద్ కూడా తన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాని ఫిబ్రవరి 25 న రిలీజ్ డేట్ ప్రకటించినట్లుగా చెప్పుకుంటున్నారు. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25 కి రాదనే పక్కా సమాచారంతోనే శర్వా డేర్ చేసి రిలీజ్ డేట్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మరి నిజంగానే భీమ్లా నాయక్ మరోసారి వాయిదా పడబోతుందా?

 

Bheemla Nayak Postponed again?:

Pawan - Rana Bheemla Nayak Postponed again?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ