ఈటివి జబర్దస్త్ చాలా ఫెమస్ కామెడీ షో. కామెడీ షోస్ కి రారాజు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లు. ఇప్పుడు ఆ జబర్దస్త్ లో కామెడీ మసక బారుతుంది. ఎందుకంటే టాప్ కమెడియన్స్ అంతా జబర్దస్త్ వదిలేసి వెళ్లిపోతున్నారు. కొంతమంది ఎప్పుడో వెళ్లిపోగా.. మరికొంతమంది ఇప్పుడు వెళ్లిపోతున్నారు. అయితే గతంలోనే కాదు.. ఇప్పటివరకు జబర్దస్త్ కి వచ్చి చాలామంది సినిమా వాళ్ళు తమ సినిమాలను ప్రమోట్ చేసుకునే వారు. హీరో నాని దగ్గర నుండి డీజే టిల్లు టీం, ఇంకా గతంలో వచ్చిన చాలా సినిమాల టీమ్స్ జబర్దస్ లో కామెడీ చేస్తూ సినిమాలని ప్రమోట్ చేసుకునే వారు. రీసెంట్ గా శేఖర్ హీరో రాజా శేఖర్ జబర్దస్త్ జేడ్జ్ గా వచ్చి శేఖర్ ని ప్రమోట్ చేసుకున్నారు.
మరి సినిమా ప్రమోషన్స్ కి అడ్డాగా ఉన్న జబర్దస్త్ కామెడీ షో లో ఇప్పుడు కామెడీ అంత ఎక్కడం లేదు, కొత్త కమెడియన్స్ కామెడీ ప్రేక్షకులు పెద్దగా మెచ్చడం లేదు. అలాంటి జబర్దస్త్ కి మళ్ళీ సినిమాల ప్రమోషన్స్ కి వస్తారా? లేదంటే స్టార్ మా లో కామెడీ స్టార్స్ షో బాగా హైలెట్ అవుతుంది. ఇకపై సినిమా వాళ్ళు జబర్దస్త్ మానేసి స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ కి వచ్చి ప్రమోట్ చేసుకుంటారేమో చూడాలి.