Advertisementt

కోపం తో ఊగిపోతున్న నాగార్జున

Fri 28th Jan 2022 11:04 AM
nagarjuna,naga chaitanya,samantha,naga chaitanya - samanta divorce,nag tweet  కోపం తో ఊగిపోతున్న నాగార్జున
Nagarjuna swaying with anger కోపం తో ఊగిపోతున్న నాగార్జున
Advertisement
Ads by CJ

నాగార్జున కి చాలా కోపం వచ్చింది. అవును, తాను చెప్పనివి చెప్పినట్టుగా రాసి పడేస్తుంటే మరి కోపం రాదా. సమంత నే ముందు విడాకులు అడిగింది అని నాగార్జున చెప్పినట్టు కొన్ని వార్తలు చక్కర్లు కొడుతుంటే, ఇంక ఉండబట్టలేక దాని గురుంచి ఒక ట్వీట్ వెయ్యాల్సి వచ్చింది. సమంత, నాగ చైతన్య విడాకుల గురించి నాగ చైతన్య బంగార్రాజు సినిమా ప్రొమోషన్ టైం లోనే క్లారిటీ ఇచ్చేసాడు. మళ్ళీ నాగార్జున ఆ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడతాడు. కానీ కొంతమంది పనికట్టుకొని, నాగార్జున మాట్లాడాడు, నోరు విప్పాడు అంటూ ఏదేదో రాసి పడేసారు. ఇవన్నీ చూసి విసుగెత్తి నాగార్జున కోపంతో ఊగిపోయాడు. 

వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు, ఆ విషయం అయిపొయింది. అలా జరగటం వల్ల అక్కినేని కుటుంబం అంతా బాధపడింది. మెల్లగా ఆ ఇష్యూ నుండి బయట పడుతున్న తరుణం లో ఈ పనిలేని రాతలు ఏంటి, ఇవి మరికొద్దిగా బాధిస్తున్నాయి, అని నాగార్జున తన దగ్గరున్న వాళ్ళతో అన్నారు అని తెలిసింది. అందుకే వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని, తాను ఒక ట్వీట్ ద్వారా అందరికి తెలియపరిచారు. తాను సమంత, నాగ చైతన్య విడాకుల గురించి ఎక్కడా మాట్లాడలేదని అవన్నీ కొందరు పనికట్టుకొని పుట్టించారని చెప్పారు. ఆ విషయం మర్చిపోడానికే నాగార్జున మరియు నాగ చైతన్య పని మీద ఫోకస్ పెట్టి పనితో బిజీ గా వుంటున్నారు.

Nagarjuna swaying with anger:

Absolute nonsense! Nagarjuna denies commenting on Sam - Chay divorce

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ