కరోనా థర్డ్ వేవ్ కారణంగా సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు జంకుతున్న టైం లో మహానటి తో జాతీయ పురస్కారం అందుకున్న కీర్తి సురేష్ మాత్రం తాను నటించిన గుడ్ లక్ సఖిని సోలో గా థియేటర్స్ లోకి తీసుకుని వచ్చింది. ఈమధ్య కాలంలో పోటీ లేకుండా సినిమా రిలీజ్ అవడం మాములు విషం కాదు. కానీ గుడ్ లక్ సఖి కి మాత్రం అడుగడునా బ్యాడ్ ఎదురైంది. రిలీజ్ డేట్ విషయమే తీసుకోండి ఇప్పటికి నాలుగుసార్లు డేట్ మారింది. ప్రమోషన్స్ విషయము అంతే. మెగాస్టార్ చిరు వచ్చి గుడ్ లక్ సఖికి హైప్ ఇస్తారనుకుంటే.. ఆయన రాలేదు. ఆయన ప్లేస్ లోకి రామ్ చరణ్ వచ్చాడు. రామ్ చరణ్ మహానటి లాంటి సినిమా చేసిన కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి టీం తో పాటు నేను స్టేజ్ పై ఉండడం నా అదృష్టం అంటూ గుడ్ లక్ సఖికి క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేసారు.
అంతలా మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసిన సినిమాపై ప్రేక్షకుల్లో ఎంతో కొంత అంచనాలుంటాయి. జగపతి బాబు లాంటి గ్రేట్ నటుడు, ఆది పినిశెట్టి లాంటి పేరున్న నటుడు ఉన్నారు. మరి గుడ్ లక్ సఖి ఆ అంచనాలను పెంచాలి కానీ దించకూడదు. కానీ ఇక్కడ అదే జరిగింది. ప్రమోషన్స్ లోనే వీక్ అనుకుంటే.. కనీసం మహానటి సినిమా మీడియా షో కి కూడా నోచుకోలేదు. గుడ్ లక్ సఖి నిర్మాతలు మీడియా వాళ్ళకి షో వెయ్యడం ఎందుకు కీర్తి సురేష్ క్రేజ్ తో సినిమా ఆడేస్తుంది అనుకున్నారేమో? అందుకే చడీ చప్పుడు లేకుండా సినిమా రిలీజ్ చేసేసారు. అసలు కీర్తి సురేష్ సినిమా అంటే ఎలా ఉండాలి. ధూమ్ ధామ్ గా హడావిడి చెయ్యాలి. గుడ్ లక్ సఖి విషయంలో అదెక్కడా కనిపించలేదు.
అటు చూస్తే థియేటర్స్ లో గుడ్ లక్ సఖి టికెట్ బుకింగ్స్ ఎంత వీక్ గా ఉన్నాయి అంటే.. మల్టిప్లెక్స్ లో ఒక్కో లైన్ కి ఒక్కో టికెట్ బుక్ అవడం చూస్తే మహానటి సినిమాకి ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా అంటూ మీడియా మిత్రులు ముక్కున వేలేసుకుంటున్నారు.